కోలీవుడ్ పై కన్నేసిన గోవా బ్యూటీ...

నాజూకు నడుము అందలతో తెలుగు కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన అందాల భామ ఇలియానా బాలీవుడ్ పై మోజుతో తెలుగువారికి దూరంగా వెళ్లిపోయింది. అక్కడ కుదురుకునేందుకు బాగానే కష్టపడినప్పటికీ ఆశించినంత గుర్తింపు లభించకపోవడంతో, మళ్లీ మనసు మార్చుకుని టాలీవుడ్ కు వచ్చింది. కానీ, అమ్మడిని వచ్చిన ఫ్లైట్ లోనే వెనక్కు పంపించేశారు ప్రేక్షకులు. దీంతో ఇప్పుడు కోలీవుడ్ ఫ్లైట్ ఎక్కే ఆలోచన చేస్తోందట మన గోవా బ్యూటీ.

అమర్ అక్బర్ ఆంటోని సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు మరోసారి దగ్గరవుదామని ప్రయత్నించిన ఇలియానా, ఇక్కడ మళ్లీ ఆ పప్పులు ఉడకవని గ్రహించింది. దీంతో వచ్చిన దారినే మళ్లీ ముంబై వెళ్లిపోయింది. ఇక ఈ బెంగతో బాగా బరువెక్కిపోయిన గోవా బ్యూటీకి బాలీవుడ్ లో ఉన్న అరకొర ఆఫర్లు సైతం తుస్సుమన్నాయి. దీంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలన్న కసితో వర్కౌట్ల మీద దృష్టిపెట్టి, మళ్లీ నాజూకు అందాలను సంతరించుకుంది.

Goa beauty eyes on Kollywood... waiting for the oppurtunities

మళ్లీ మెరుపు తీగలా మారిపోయాను చూస్కోండి అంటూ సోషల్ మీడియాపై దండయాత్ర చేస్తున్నా, ఇలియానాను ఎవ్వరు పట్టించుకోకపోవడంతో, ఇప్పడు కోలీవుడ్ పై దృష్ఠి సారించింది. గతంలో కొన్ని తమిళ సినిమాల్లో నటించిన అనుభవం ఉండటంతో, ఇప్పుడు ఆసక్తికరమైన పాత్రలు ఏమన్నా ఉంటే చెప్పండి అంటూ కోలీవుడ్ ఫ్రెండ్స్ కు సందేశాలు పంపిస్తోందట. అంతేకాదు వీలైతే సీనియర్ హీరోలతోనే నటించాలన్నది అమ్మడి అభిప్రాయం. మరి గోవా బ్యూటీ కోరకను మన్నించి తమిళ తంబిలైనా అమ్మడిని అక్కున చేర్చుకుంటారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X