సోనాలి బింద్రే గురించి షాకింగ్ న్యూస్.. భర్త రెస్పాన్స్!
బాలీవుడ్ అందాల తార సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడింది. ఇటీవల ఆమెకు హై గ్రేడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మొత్తం ఈ వార్త విని షాక్ కు గురైంది. సెలెబ్రిటీలంతా ఆమెకు అండగా నిలిచారు. ప్రస్తుతం సోనాలి బింద్రే న్యూయార్క్ లో క్యాసర్ చికిత్స చేయించుకుంటోంది.
ఇటీవల ఓ బిజెపి ఎమ్మెల్యే సోషల్ మీడియాలో చేసిన ప్రకటన అందరిని కలవరపాటుకు గురిచేసింది. సోనాలి బింద్రే మరణించిడంటూ ఆయన సోషల్ మీడియాలో సందేశం పెట్టారు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరారు. సోనాలి బింద్రే గురించి వ్యాపిస్తున్న ఇలాంటి రూమర్స్ పై ఆమె భర్త గోల్డి బెహెల్ స్పందించారు.

ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని రెస్పాన్సిబుల్ గా ఉపయోగించాలని కోరాడు. మనసులని గాయపరిచే ఇలాంటి వదంతులు వ్యాపింపజేయవద్దని కోరారు. ప్రస్తుతం సోనాలి బింద్రేకు చికిత్స జరుగుతోంది. ఆమె ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











