Meetha Raghunath: అబ్బాయిలకు హార్ట్ బ్రేక్ న్యూస్... మీ కలల యువరాణికి పెళ్లయిపోతుంది!
కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను ఆదరిస్తారు. అలా ఓ తమిళ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది. అదేంటో కాదు.. గుడ్ నైట్ సినిమా. ఇక ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమాలో అందాల భామ మీరా రఘునాథ్ హీరోయిన్ గా నటించింది. ఎప్పుడైతే నటించిందో.. ఇక ఆమె యువకుల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ భామ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకుని యువకులకు షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్న సినిమాగా విడుదలైన గుడ్ నైట్.. ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయింది. ఇక తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో తెలుగులో రిలీజ్ అయి.. ఇక్కడి వారికి కూడా బాగా కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లపై ఈ సినిమా తెరకెక్కింది.

డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాలోని హీరోయిన్ బాగా కనెక్ట్ అయింది. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాదు.. సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. 'అను' పాత్రలో నటించిన మీరా రఘునాథ్.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా యూత్ కు కలల రాణిగా అయిపోయింది ఈ భామ. ఈ సినిమాలోని భామను చూసి చాలా మంది ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే బాగుండు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇక ఈ సినిమాలోని హీరో, హీరోయిన్లుగా నటించిన మణికందన్, మీరా రఘునాథ్ ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మీరా రఘునాథ్ తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకుందనే చెప్పాలి. 2022లో సా నీ నిధూమ్ నీ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గుడ్ నైట్ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన చాలా మంది ఇలాంటి భార్య రావాలని కోరుకున్నారు.

ఇక ఈ సినిమాలో మీరా పాత్ర భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందనే చెప్పాలి. ఈ సినిమా వల్ల ఆమెకు కోలీవుడ్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ క్రమంలో యువకుల గుండె పగిలిపోయే న్యూస్ ఒకటి చెప్పింది మీరా. మీరా త్వరలో పెళ్లీ పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మీరా రఘునాథ్ కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనుండగా, అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కొంత మంది మీరా హార్ట్ బ్రేక్ చేశావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











