Divorce: భర్తకు విశ్వంభర బ్యూటీ విడాకులు? 4 ఏళ్ల కాపురానికి గుడ్‌బై అంటూ రూమర్లు!

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల విడాకుల గోల ఈ మధ్యకాలంలో ఎక్కువగానే వినిపిస్తున్నది. సోషల్ మీడియాలో తారలు స్పందించే తీరుపై అనేక అనుమానాలు, సందేహాలు వైరల్ అవుతూనే అనేక రూమర్లు, గాసిప్స్‌కు దారి తీస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో నాగిని ఫేమ్ మౌనీ రాయ్ వైవాహిక జీవితానికి సంబంధించిన వార్త ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సోషల్ మీడియాలో తన భర్తతో అందాల తార తెగతెంపులు చేసుకోబోతున్నారనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే మౌనీ రాయ్ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా? 4 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భారీ చర్చకు దారి తీసాయి. ఇంతకు ఈ రూమర్ వెనుక ఉన్న అనుమానం ఏమిటంటే?

మౌనీ రాయ్ విషయానికి వస్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ అందాల భామ టెలివిజన్ రంగంలో పాపులర్ నటిగా పేరు సంపాదించుకొన్నారు. 2006 సంవత్సరంలో ఏక్తా కపూర్ నిర్మించిన క్యోంకి సాస్ బీ బహు తీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే పలు సీరియల్స్, రియాలిటీ షోలో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే టెలివిజన్ యాక్టర్‌గా రికార్డు కెక్కింది.

Gossip of Mouni Roy Divorce

తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే దుబాయ్‌కి చెందిన మలయాళీ బిజినెస్‌మ్యాన్ సూరజ్ నంబియార్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని నెలలు అఫైర్ కొనసాగించిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. మూడేళ్ల రిలేషన్ షిప్ తర్వాత 2022 సంవత్సరం జనవరి 27వ తేదీన సూరజ్, మౌనీ రాయ్ గోవాలో బెంగాలీ,కేరళ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకొన్నారు.

అయితే మౌనీరాయ్, సూరజ్ ఇద్దరూ కూడా కలిసి మెలిసి జీవిస్తున్నారనే ఫీలింగ్‌లో అభిమానులు, సినీ వర్గాలు ఉన్నాయి. కానీ గత కొద్ది నెలలుగా వారి మధ్య అభిప్రాయ బేధాలు చోటు చేసుకొన్నాయి. ఆ కారణంగా వెర్వేరుగా జీవించాలని అనుకొంటున్నారనే వార్త మీడియాలో వినిపించింది. అయితే ఈ ఊహాగానాలకు తగినట్టుగానే ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో వారిద్దరూ విడిపోతున్నారనే విషయం ఊపందుకొన్నది. మౌనీనే కాకుండా ఆమె ఫ్రెండ్ దిశా పటానీ కూడా అన్‌ఫాలో కావడంతో ఈ అనుమానానికి మరింత బలం చేకూరింది. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు వారిద్దరూ సపరేట్ అవుతున్నారనే కామెంట్స్ పెడుతున్నారు.

కానీ ఆ ఇద్దరు మాత్రం తమ వైవాహిక జీవితంపై వస్తున్న రూమర్లును ఇప్పటి వరకు ఖండించలేదు. దాంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. తమ దాంపత్య జీవితంలో కలతలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై వస్తున్న ఊహాగానాలకు క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం బయటకు రాదని సినీ వర్గాలు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ రూమర్‌పై మౌనీ రాయ్ గానీ, సూరజ్ గానీ స్పందిస్తారా? లేదా చూడాలి.

ఇక మౌనీ రాయ్ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది భూత్నీ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. నాగిని ఫేమ్ యాక్టర్ ప్రస్తుతం తెలుగు వారికి చేరువ అయ్యేందుకు రెడీ అవుతున్నారు విశ్వంభర సినిమాలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. అలాగే వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ థాకూర్ నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఇంకా ది వైవ్స్ అనే సినిమాలో నటిస్తున్నారు.

Read more about: mouni roy naagin suraj nambiar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X