జీవితాంతం పెళ్లికి దూరంగా.. లగ్జరీ లైఫ్ వదిలేసి ఆ దీక్షలోకి టాప్ హీరోయిన్
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన మార్పుకు సంకేతం. తనకంటూ ఓ కుటుంబం, జీవిత భాగస్వామి, పిల్లలతో పాటు బాధ్యతలతో మనిషి కొత్తగా రూపాంతరం చెందుతాడు. పెళ్లితోనే జీవితానికి సార్ధకత అని మన పెద్దలు చెబుతారు. ఇక భారతీయ వైవాహిక వ్యవస్థకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు, సంఘ జీవనానికి వివాహం అత్యంత కీలకమని మన పూర్వీకులు విశ్వసించి ఎన్నో నియమాలు, కట్టుబాట్లు పెట్టారు. అయితే మారుతున్న కాలమాన పరిస్ధితుల్లో పెళ్లికి దూరంగా ఉంటున్న వారెందరో. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే.
సంతోషం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ
అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంతోషం చిత్రంతో తెలుగు వారిని పలకరించిన గ్రేసీ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ అమ్మడి రూపం ఇప్పటికీ గుర్తే. నిజానికి తెలుగు కంటే ముందే బాలీవుడ్ చిత్రాలలో నటించారు గ్రేసీ సింగ్. న్యూఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. టెలివిజన్ రంగంలో తొలుత అడుగుపెట్టారు. అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న గ్రేసీ సింగ్‌కు తొలుత హూ తూ తూ అనే హిందీ సినిమాలో అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఏకంగా లగాన్ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ షారుఖ్ ఖాన్‌కు జోడీగా నటించే ఛాన్స్ దక్కడంతో గ్రేసీ సింగ్ కెరీర్ మారిపోయింది.

లగాన్‌లో అమీర్‌ఖాన్‌కు జోడీగా
లగాన్ బ్లాక్ బస్టర్ కావడంతో దేశవ్యాప్తంగా గ్రేసీ సింగ్ పేరు మారు మోగిపోయింది. అనంతరం సంతోషం సినిమా ద్వారా తెలుగు వారిని పలకరించారు. తర్వాత తప్పు చేసి పప్పు కూడులో మోహన్ బాబు, శ్రీకాంత్‌లతో ఆడిపాడారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించులేకపోవడంతో తిరిగి హిందీ పరిశ్రమపై ఫోకస్ పెట్టారు గ్రేసీ సింగ్. మున్నాభాయి ఎంబీబీఎస్, గంగాజల్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆమె అవకాశం దక్కించుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, రామ్ దేవ్ చిత్రాలతో తెలుగు వారిని పలకరించారు గ్రేసీ సింగ్.
బుల్లితెరపైనా హిట్ కొట్టిన గ్రేసీ
దాదాపు 27 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, పంజాబీ, హిందీ, మలయాళం భాషల్లో గ్రేసీ సింగ్ బుల్లితెరపైనా సక్సెస్ అయ్యారు. సంతోషి మా అనే ధారావాహికతో టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు దగ్గరయ్యారు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన గ్రేసీ సింగ్ పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అయితే వయసు పెరుగుతుండటంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. 50కి చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో గ్రేసీ సింగ్ అసలు పెళ్లి చేసుకుంటారా? లేదా? అని ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
బ్రహ్మకుమారీల మార్గంలో
కొన్నాళ్లుగటా ఆధ్యాత్మిక మార్గంలో తన ప్రస్థానం సాగిస్తున్నారు గ్రేసీ సింగ్. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ టాప్ హీరోయిన్ తాజాగా తన వివాహానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న గ్రేసీ సింగ్.. తాను కూడా బ్రహ్మాకుమారీగా మారిపోయారు. తన జీవితాన్ని నాట్యం, నటన, ఆధ్యాత్మికతకు, సేవకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. బ్రహ్మకుమారిగా ఆనందం, శాంతిని పొందుతున్నట్లు గ్రేసీ సింగ్ తెలిపారు. తెల్ల చీరలో, ప్రశాంతమైన ముఖంతో గ్రేసీ సింగ్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











