16- 17 సార్లు అలా అడిగాడు.. ఇంటిమేట్ సీన్‌పై నటి ఎమోషనల్ కామెంట్స్..

కన్నడ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) హిందీ సినిమాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. "హంటర్," "బ్లర్," "బాద్దీ" వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న గుల్షన్, ఇప్పుడు మరోసారి తన ప్రొఫెషనలిజం, సెన్సిటివిటీతో వార్తల్లో నిలిచాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 21 ఏళ్లు అయిన తరువాత తన మాతృభాషలో 'కాంతార: చాప్టర్ 1' సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న గుల్షన్, ప్రస్తుతం 'థెరపీ షెరపీ (Therapy Sherapy)' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో ఆయన సరసన మరాఠీ నటి గిరిజా ఓక్ (Girija Oak Godbole) నటిస్తున్నారు.

తాజాగా గిరిజా ఓక్ (Girija Oak Godbole) ఒక ఇంటర్వ్యూలో ఈ సిరీస్ షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా, గుల్షన్‌తో చేసిన ఒక ఇంటిమేట్ సీన్ సమయంలో ఆయన చూపిన గౌరవం, కేర్ గురించి ఆమె వివరాలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Gulshan Devaiah Asked Are You Okay 16 Times During Intimate Scene Says Girija Oak

గిరిజా మాట్లాడుతూ "ఇంటిమేట్ సీన్‌లలో చాలా సార్లు అసౌకర్యం కలిగే పరిస్థితులు వస్తాయి. కానీ గుల్షన్ దేవయ్యతో పనిచేసినప్పుడు ఆ ఫీలింగ్ అస్సలు రాలేదు. షూట్‌కి ముందు ఆయన తన వెనిటీ వాన్ నుంచి మూడు, నాలుగు తలుపులు తీసుకొచ్చి 'ఇవిలో మీకు నచ్చింది ఎంచుకోండి, మీకు కంఫర్ట్‌గా ఉంటే ఉపయోగించుకోండి ' అని చెప్పారు. అంతేకాదు, సీన్ జరుగుతున్న సమయంలో కూడా ఆయన కనీసం 16 నుంచి 17 సార్లు "మీకు బాగుందా?" (Are you okay?) అని అడిగారు," అని చెప్పారు.

ఆ సీన్‌లో ఎలాంటి నగ్నత లేదా అసభ్యకరత లేదని గిరిజా స్పష్టం చేశారు. "ఆ సన్నివేశం ప్యాషన్ గురించి కాదు, కానీ దంపతుల మధ్య ఉన్న భావోద్వేగ దూరం గురించి. జీవితంలో ప్రేమ క్రమంగా రొటీన్‌గా మారినప్పుడు, ఆ బంధం ఎలా మసకబారిపోతుందనే భావనను చూపించడమే లక్ష్యం," అని వివరించారు.

ఒక దశలో అసౌకర్యంగా అనిపించిందని చెప్పగా, గుల్షన్ వెంటనే "వదిలేయ్, లేదా సర్దిపెట్టు.. నీకు కంఫర్ట్‌గా ఉన్నదే చేద్దాం" అంటూ ఆమె నిర్ణయాన్ని గౌరవించారని గిరిజా పేర్కొన్నారు. "అతని ప్రవర్తన చాలా సెన్సిటివ్‌గా, గౌరవంతో కూడినది. ఆ సీన్ పూర్తయ్యాక నాకు ఎటువంటి అసౌకర్యం అనిపించలేదు. ఒక మహిళా నటిగా నేను సేఫ్‌గా, రిస్పెక్ట్‌గా ఫీలయ్యాను. అతని ప్రోత్సహంతో నాపై నాకు విశ్వాసం వచ్చింది," అని ఎమోషనల్‌గా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో గిరిజా ఓక్, గుల్షన్ దేవయ్య ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. నెటిజన్లు "ఇలాంటి సెన్సిటివ్ ప్రొఫెషనల్స్ ఇండస్ట్రీకి కావాలి " అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'థెరపీ షెరపీ' సిరీస్ వివరాలు వస్తే.. ఈ వెబ్ సిరీస్ మానవ సంబంధాలు, భావోద్వేగలు, రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లలోని దూరాన్ని చూపించే సైకాలజికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో గుల్షన్ దేవయ్య, గిరిజా ఓక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సిరీస్ విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

More from Filmibeat

Read more about: gulshan devaiah bollywood girija
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X