Jyothi Rai :కిల్లర్ గా మారిన జగతి మేడం.. జ్యోతిరాయ్ ఫస్ట్ లుక్ వైరల్ ..

Jyothi Rai : సినీ ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అలా తాజాగా ఓ బుల్లితెర నటి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఇకనుండి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో ? ఆమె నటిస్తున్న చిత్రం ఏంటో? ఓ లుక్కెయ్యండి.

గుప్పెడంత మనస్సు అనే సీరియర్ ద్వారా 'జగతి మేడం'గా పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతిరాయ్. తెలుగు ప్రజల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది . ఈమె ఎక్కువగా జగతి మేడమ్‌గానే తెలుసు. కర్నాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించి, తనకంటూ ప్రత్యేక పాపులర్టీ ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా'అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో పలు సీరియల్స్ లో నటించి తెగ ఫేమస్ అయింది.

Guppedanta Manasu fame Jagathi madam alias jyothi rai movie killer Part 1 Dream Girl Motion Poster Unveiled

ఆ తరువాత తెలుగు సిరీయల్ లో నటించి అవకాశం అందుకుంది. ఇలా తొలుత 'కన్యాదానం' అనే సీరియల్‌ కనిపించింది. కానీ ఈ సీరియల్ తో అంతగా గుర్తింపు రాలేదు. కానీ, 'గుప్పెడంత మనసు' సీరియల్ జగతి అనే పాత్రలో నటించి, తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించింది. ఈ రోల్ కారణంగా జ్యోతి రాయ్ రేంజ్ అమాంతం పెరిగింది.

జ్యోతి రాయ్ కేవలం సిరియల్స్ లోనే కాకుండా.. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి సినిమాల్లో కూడా నటించింది. అలాగే.. దియా, గంధాడ్ గుడి, 99, మడిపు, 'ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్‌లు నటించింది. ఇలా సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్న జ్యోతి రాయ్. సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తరుచు.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.

ఇప్పటి వరకు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి రాయ్ సిల్వర్ స్కీన్ పై సందడి చేయనున్నది. ఎన్నో రోజుల నుంచి తాను తెలుగు సినిమా చేయబోతున్నట్లు పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైనల్ గా తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చేసింది జ్యోతిరాయ్. ఈ బ్యూటీ తన భర్త పూర్వజ్ దర్శకత్వంలోనే ఓ సినిమా నటించనున్నది. ఆమె భర్త ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు ఇందులో హీరోగా కూడా నటిస్తున్నారు. క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'కిల్లర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నారట.

'కిల్లర్' సినిమాను రెండు పార్టులుగా తీయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఫస్ట్ మూవీకి 'కిల్లర్' పార్ట్ -1 డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ ను పెట్టారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో జ్యోతి రాయ్ లూక్ అదిరిపోయింది. ఇందులో ఆమె లేడి రోబో క్యారెక్టర్ ను ఫ్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ డిటేల్స్ అద్దంలో కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ ను చూస్తే.. సైన్స్ థ్రిలర్ గా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది.

"కిల్లర్" మూవీ మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే - చేతిలో గొడ్డలి పట్టుకున్న పవర్ ఫుల్ వుమెన్ రోబోను పరిచయం చేశారు. ఆ రోబో జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ గా మారడం ఆసక్తికరంగా ఉంది. జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ లుక్ లో ఆమె ఒక భుజానికి వెజిటేబుల్స్ బ్యాగ్, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంది. అద్దంలో ఆమె రిఫ్లెక్షన్ పవర్ ఫుల్ వుమెన్ రోబోను చూపిస్తోంది. మోషన్ పోస్టర్ లో చూపించిన ఎలిమెంట్స్ అన్నీ "కిల్లర్" మూవీపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.

నటీనటులు: జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, తదితరులు

రచన, దర్శకత్వం - సుక్కు పూర్వాజ్

సినిమాటోగ్రఫీ - జగదీశ్ బొమ్మిశెట్టి

మ్యూజిక్ - అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం
వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ - మెర్జ్ ఎక్స్ఆర్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్స్ - థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.
నిర్మాతలు - పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ మాధవ్, యోగి పోసాని

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X