Samantha సమంతపై నిప్పులు చెరిగిన యువ హీరో భార్య..
గత రెండు రోజుల నుంచి సమంత చేసిన ఓ పోస్ట్ ఆమెను లేనిపోని వివాదంలోకి నెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత వర్సెస్ లివర్ డాక్టర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. పైగా సమంత ఇచ్చిన హెల్త్ అడ్వైస్ పై ఆ డాక్టర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల సమంత పోస్ట్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరి సమంత అడ్వైస్ కి గుత్తా జ్వాల రియాక్షన్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
మయోసైటిస్ కారణంగా దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ను ఫాలోవర్లతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సమంత చేసిన తాజా పోస్ట్ వివాదానికి దారితీసింది.

తాజాగా సామ్ నెబ్యులైజర్ ను ఉపయోగిస్తున్న ఒక ఫోటోను షేర్ చేసింది. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజర్ చేయండి అంటూ తన ఫాలోవర్లకు సలహా ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయిపోవడం, ఆమె అడ్వైజ్ ను చూసిన డాక్టర్లుమ్ పలువురు ప్రముఖులు మండిపడడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది.
సామ్ చెప్పిన మ్యాజిక్ ఫార్ములా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబ్యులైజేషన్ గురించి లివర్ డాక్టర్ అని పిలుచుకుంటున్న డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సమంత చెప్పిన ఈ మ్యాజిక్ ఫార్ములాను ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి అని హెచ్చరిస్తూనే అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ జారీ చేసిన హెచ్చరికలను జనాల ముందుకు తీసుకొచ్చారు. సెలబ్రిటీ ముసుగులో ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని భగ్గుమన్నారు లివర్ డాక్టర్.
అయితే ఆ తర్వాత సమంత సదరు డాక్టర్ ను ఉద్దేశిస్తూ తనను ఇలా నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్ తో మాట్లాడి ఉంటే బాగుండేది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత లివర్ డాక్టర్ ఆమె రిప్లై కి స్పందిస్తూ బాధితురాలుగా యాక్ట్ చేయడం మానేయాలంటూ సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు సమంతా పోస్టు పై మండిపడుతుండగా బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందించింది.

తమను భారీ సంఖ్యలో ఫాలో అవుతున్న అభిమానులకు ఔషధం గురించి సూచించే ప్రముఖులకు నా ఏకైక ప్రశ్న... సహాయం చేయడమే మీ ఉద్దేశం. కానీ ఒకవేళ మీరు చెప్పిన హెల్త్ టిప్ పని చేయకపోతే, ప్రాణాపాయానికి కారణమైతే మీరు బాధ్యత వహిస్తారా? లేదా మీరు ట్యాగ్ చేసిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా? అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నించింది. మరి ఈ వివాదంలో నుంచి సమంత ఎలా బయట పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











