సోషల్ మీడియా సెగలకు కారణమైన హంసా నందిని.. అలా పడుకొని!
ఐటెం పాప హంసానందిని మరోసారి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో యువతకు దగ్గరైన ఈమె ఐటెం బ్యూటీగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి యూత్ ఓరియెంటెడ్ సాంగ్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది హంసా.
కానీ ఈ మధ్యకాలంలో హంసా నందినికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో హంసా లాంటి స్పెషల్ బ్యూటీలకు అవకాశాలు ఆవిరైపోయాయి. అలాగని తనలోని సెగలు పుట్టించే అందాలను దాచుకుంటే ఎలా! అని భావించిన హంసా నందిని.. సోషల్ మీడియా ద్వారా సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. బీచ్ ఒడ్డున అలా పడుకొని ఆమె పెట్టిన పోజులు కుర్రకారు గుండె వేగాన్ని పెంచేస్తున్నాయి. ఐటెం పాప, పైగా కావాల్సినంత అందాల ఆరబోత కనిపిస్తుండటంతో ఈ పిక్స్‌ని షేర్ చేస్తూ వైరల్ చేసేశారు నెటిజన్లు.

గతంలో 'ఈగ', 'లౌక్యం', 'అత్తారింటికి దారేది', 'రామయ్య వస్తావయ్యా' వంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో కనిపించింది హంసా. అందంతో పాటు మంచి హైట్ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్ గా మంచి ఛాన్సులు మాత్రం రాలేదు. దీంతో తెలుగుతో ఇతర భాషా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇలా సోషల్ మీడియా వేదికగా టచ్ లోకి వస్తోంది హంసా నందిని.


Click it and Unblock the Notifications











