సండే మోటివేషన్ అంటూ స్పెషల్ కిక్కిచ్చిన ఐటెం పాప.. స్పైసీ లుక్ వైరల్
ఐటెం పాప హంసానందిని సోషల్ మీడియాలో యమ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలతో సెగలు పుట్టించే ఈ భామ ఈ సారి స్పెషల్ బికినీ వేసి సూపర్ కిక్కించింది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో యువతకు బాగా దగ్గరైన ఈమె ఐటెం బ్యూటీగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి యూత్ ఓరియెంటెడ్ సాంగ్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది హంసా.
కాకపోతే ఈ మధ్యకాలంలో వెండితెరపై హంసా నందిని జోష్ కాస్త తగ్గింది. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో హంసా లాంటి ఐటెం పాపలకు డిమాండ్ తగ్గింది. పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో స్పెషల్ బ్యూటీలకు అవకాశాలు ఆవిరైపోయాయి. అయితే మాత్రం.. తనలోని సెగలు పుట్టించే అందాలను దాచుకుంటే ఎలా! అని భావించిన హంసా నందిని సోషల్ మీడియా వేదికగా సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ మత్తెక్కిస్తూ యమ కిక్కిచ్చాయి.

స్విమ్మింగ్ పూల్ ఒడ్డున బ్లాక్ బికినీలో హంసా ఇచ్చిన పోజులు కుర్రకారు గుండె వేగాన్ని పెంచేస్తున్నాయి. పైగా వీటిపై 'సండే మోటివేషన్' అని ట్యాగ్ చేసింది ఈ అందాల సుందరి. అసలే ఐటెం పాప, పైగా కావాల్సినంత అందాల ఆరబోత, పైపెచ్చు మోటివేషన్ కూడా చూసి షేక్ అవుతున్నారు నెటిజన్లు. అలాగే వెంటనే షేర్ చేస్తూ వైరల్ చేసేశారు కూడా.
గతంలో 'ఈగ', 'లౌక్యం', 'అత్తారింటికి దారేది', 'రామయ్య వస్తావయ్యా' వంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో కనిపించింది హంసా. అందంతో పాటు మంచి హైట్ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్ గా మంచి ఛాన్సులు మాత్రం రాలేదు. దీంతో తెలుగుతో ఇతర భాషా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇలా సోషల్ మీడియా వేదికగా టచ్ లోకి వస్తోంది హంసా నందిని.


Click it and Unblock the Notifications











