పెళ్లి గురించి ప్రస్తావించిన హన్సిక!
ఆపిల్ బ్యూటీ హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చినా హీరోయిన్ గా మారింది మాత్రం అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతోనే. ఈ చిత్రం తరువాత హన్సిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది ఇటీవల హన్సిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి ప్రస్తావించింది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చెప్పలేనని తెలిపింది.
ముంబైలో హన్సిక ఓ అందమైన ఇంటిని నిర్మించుకుంటోంది. ఆ ఇంటిలోకి ప్రిన్స్ ఎప్పుడు వస్తాడు అని ప్రశ్నించగా.. నేను ప్రిన్సెస్.. మా అమ్మ క్వీన్. ప్రిన్స్ ఎప్పుడు వస్తాడో తెలియదు అంటూ పెళ్లి గురించి దాటవేసింది.

31 మంది పిల్లలని దత్తత తీసుకున్న హన్సిక వారికోసం ముంబైలో ఓ ఆశ్రమం నిర్మించే పనిలో ఉంది. తన ఇంటి నిర్మాణంతో పాటు ఈ ఆశ్రమం నిర్మాణపనులు కూడా జరుగుతున్నాయి. హన్సిక ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











