Hansika: వయసు పెరిగేందుకు ఇంజక్షన్.. శింబుతో బ్రేకప్.. అసలు నిజాలు చెప్పిన హన్సిక
టాలీవుడ్ లోకి ఎంతోమంది పక్క రాష్ట్రాల భామలు వచ్చి సందడి చేశారు. డైరెక్టర్లు కూడా కొత్త కొత్త హీరోయిన్లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో పూరీ జగన్నాథ్ ఒకరు. పూరీ ఇంట్రడ్యూస్ చేసిన చాలా మంది హీరోయిన్లు తెలుగులో మొదటి సినిమాతోనే క్లిక్ అయ్యారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ హన్సిక ఒకరు.
అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. బాల నటి నుంచి హీరోయిన్ గా మారిన హన్సికపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమాయణం, వయసు పెరిగేందుకు ఇంజక్షన్ వాడిందన్న వార్తలపై తాజాగా నోరు విప్పింది ఈ బ్యూటి.

బాల నటిగా అనేక సినిమాల్లో..
సినీ ఇండస్ట్రీలోకి బాల నటిగా అడుగు పెట్టి పాపులర్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది గ్లామరస్ బ్యూటి హన్సిక. అయితే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా సినిమాతో చాలా పేరు తెచ్చుకున్న హన్సిక ఇందిలో అనేక చిత్రాల్లో బాలనటిగా అలరించింది. హవా, జాగో, హమ్ కౌన్ హై, అబ్ర క దబ్ర వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హన్సిక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

స్టార్ హీరోలతో జోడి కట్టి..
డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హన్సిక మోత్వానీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో హన్సికకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీ దాదాపు చాలా మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా ఆయా ఇండస్ట్రీల్లోనూ వరుస చిత్రాలతో హవా చాటింది.

సినిమాలతో బిజీగా..
చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన హన్సిక ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటిస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ జెట్ స్పీడుతో వెళ్తోంది. ఇక ఇటీవలే వైవాహికి జీవితంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటి.

ప్రియుడిని పెళ్లాడి..
గతేడాది డిసెంబర్ 4న ఆమె ప్రియుడు సోహైల్ ఖతురియాని వివాహం చేసుకుంది హన్సిక. ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లి మహోత్సవాన్ని హన్సిక లవ్ షాదీ డ్రామా అనే పేరుతో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేశారు. ఈ వీడియోలో అనేక విషయాలను పంచుకున్న హన్సిక తన వ్యక్తిగతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ వీడియోలో హీరో శింబుతో ప్రేమాయణం, బ్రేకప్, చిన్న వయసులో హార్మోన్ల ఎదుగుదలకు ఇంజక్షన్ ఇవ్వడం వంటి విషయాలను పంచుకుంది.

మా అమ్మ నాకు ఇచ్చిందని..
"నేను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కొంతమంది నా మీద చెత్త వార్తలు చెప్పుకొచ్చారు. నేను త్వగా పెరగడానికి మా అమ్మ నాకు ఇంజక్షన్ ఇచ్చిందన్నారు. నా గురించి, నా కుటుంబం గురించి ఎన్నో రాసుకొచ్చారు. 8 ఏళ్లకే నేను నటిగా మారాను. దానికి మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్ ఇచ్చి పెద్దదిగా మార్చిందని ఎలా అనుకుంటారు" అని ఎమోషనల్ అయింది హన్సిక.

టాటా బిర్లా కంటే ఎక్కువ..
ఆ తర్వాత "ఈ వార్తే కనుక నిజం అయి ఉంటే, నా కూతురుకు నేను ఇంజక్షన్ ఇచ్చి ఉంటే.. టాటా బిర్లా కంటే ఎక్కువ ధనవంతురాలిని అయ్యేదాన్ని. మీరు కూడా ఆ ఇంజక్షన్ కోసం మా ఇంటి ముందు క్యూ కట్టేవారు. అసలు ఇలాంటి వార్తలు రాసేవారికి కామన్ సెన్స్ ఉందా" అని అసహనం వ్యక్తం చేశారు హన్సిక తల్లి.

సోహైల్ నా లైఫ్ లోకి వచ్చాకే..
"శింబుతో బ్రేకప్ తర్వాత మరొకరిని ప్రేమించడానికి చాలా సమయం పట్టింది. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్ ని. కానీ, భావోద్వేగాలు బయటకు చూపించలేను. నాకు పెళ్లి మీద చాలా నమ్మకం ఉంది. నిజం చెప్పాలంటే నేను మరొకరిని ప్రేమించడానికి సుమారుగా 7, 8 ఏళ్లు పట్టింది. సోహైల్ నా జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది. నా గత రిలేషన్ ముగిసిపోయింది. ప్రస్తుతం నేను కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాను. మాకు దేవుడు దారి చూపించాడు" అని హన్సిక తెలిపింది.


Click it and Unblock the Notifications











