డ్రైవర్‌తో ఇలాగేనా ప్రవర్తించేది.. ఆపిల్ పిల్లని దుమ్ముదులుపుతున్న నెటిజన్స్, వీడియో వైరల్!
Recommended Video

అందాల తార హన్సికకు అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకోవడం అలవాటే. ఈ ఆపిల్ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. నెటిజన్ల నుంచి చివాట్లు ఎదుర్కొంటోంది. హన్సికకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కెరీర్ ఆరంభంలో దక్షణాది చిత్రాలలో హన్సిక అదరకొట్టిన సంగతి తెలిసిందే. కుర్ర వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. తమిళనాడులో ఆమెకు గుడి కట్టేస్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది.

వైరల్ అవుతున్న వీడియో
హన్సికకు విమర్శలు ఎదురుకావడానికి కారణమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూడడానికి సాధారణంగానే కనిపిస్తున్నా.. ఆలోచిస్తే ఆపిల్ పిల్ల వైపు కూడా తప్పుందని అనిపించకమానదు.

డ్రైవర్‌తో అగౌరవంగా
షాపింగ్ ముంగించుకుని బయలు దేరుతున హన్సిక తన కారు వద్దకు వచ్చింది. అప్పటికే డ్రైవర్ ఆమె కోసం ఎదురుచొస్తున్నాడు. డ్రైవర్ ని పేరు పెట్టి పిలుస్తూ.. పాండే.. పక్కకు జరుగు.. నేను డ్రైవ్ చేస్తా అంటూ హన్సిక కనిపిస్తున్న వీడియో వైరల్ గా మారింది. వయసులో తనకన్నా పెద్ద అయిన డ్రైవర్ కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ప్రవర్తించిందనేదే నెటిజన్లు మండిపడుతున్న విషయం.

దుమ్ముదులిపేస్తునారు
నెటిజన్లు ఈ వీడియోని వైరల్ చేస్తూ.. హన్సికపై విమర్శల మోత మోగిస్తున్నారు. వయసులో పెద్ద అయిన డ్రైవర్ ని కనీసం అన్నా, భయ్యా లాంటి పిలుపు లేకుండా అమర్యాదగా ప్రవర్తించడం ఏంటని అంటున్నారు. వీడియో కింద పలు రకాలుగా కామెంట్స్ పెడుతూ హన్సికని విరసిస్తున్నారు.

వేంటనే మానేయ్
నెటిజన్ల కామెంట్స్ ఇలా ఉన్నాయి.. నీ కింద అతడు పనిచేస్తున్నాడు అంటే ఎలా పడితే అలా ప్రవర్తించడానికి కాదు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరు వెంటనే ఆమె వద్ద ఉద్యోగం మానేయండి.. అలాగే అందరూ కాస్త హన్సికకు మర్యాద నేర్పించండి అంటూ హన్సికపై మండిపడుతున్నారు.

తెలుగు తెరకు కాస్త దూరంగా
ఇదిలా ఉండగా.. హన్సిక దేశముదురు చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే యువతని అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. దేశముదురు తరువాత హన్సిక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం హన్సిక తెలుగులో సినిమాలు తగ్గించింది. హన్సిక చివరగా నటించిన తెలుగు చిత్రం గౌతమ్ నంద. ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాల్లో ఈ ఆపిల్ బ్యూటీ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











