బాలయ్యతో చిందేస్తున్న హన్సిక.. 'యమగోల' సందడి!
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటిస్తున్నాడు. ఆ మధ్యన విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీరంగానికి సంబందించిన విశేషాలు చూపించనున్నారు.
తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఎన్టీఆర్, జయప్రద కలసి నటించిన యమగోల చిత్రానికి సంబందించినది ఈ పోస్టర్. ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అదరగొడుతుండగా.. జయప్రద పాత్రని హన్సిక పోషిస్తోంది. జయప్రదలా హన్సిక హావభావాలు పలికిస్తోందనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్ లో యమగోల, అడవి రాముడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

సావిత్రి పాత్రలో నిర్యమీనన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, కృష్ణ కుమారి పాత్రలో ప్రణీత ఇలా మరికొంత మంది హీరోయిన్లు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో సందడి చేయనున్నారు. రానా దగ్గుబాటి చంద్రబాబు పాత్రలో, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎలాంటి అంశాలు చిత్రకరించారు, బాలయ్య ఎలా నటించాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











