హీరోయిన్ హన్సికపై దారుణంగా కేసు నమోదు.. కష్టాల్లో దేశముదురు బ్యూటీ

తెలుగు సినిమా దగ్గర హీరోయిన్ గా అత్యంత పిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ లో ఇటీవల యంగ్ హీరోయిన్స్ శ్రీలీల అలాగే కృతి శెట్టి లాంటి బ్యూటీలు కనిపిస్తారు. కాగా ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా కేవలం తమ 17వ ఏటకే సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు ఆడియెన్స్ మెయిన్ గా యువత హృదయాలు కొల్లగొట్టారు.

ఇలాంటి అంశాలు మన హీరోయిన్స్ లో ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కానీ వీళ్ళ కంటే చిన్న వయస్సులోనే తన వయసుకి మించిన రోల్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది హన్సిక మోత్వానీ అని చెప్పాలి. మన తెలుగు సినిమాకి అయితే దేశ ముదురు సినిమాతో అప్పట్లో సంచలనం రేపిన హన్సిక తన తెలుగు సినిమా చేసిన నాటికి తన వయస్సు కేవలం అంటే కేవలం పదిహేనేళ్ళు మాత్రమే.

Hansika Motwani fixed in Domestic Violence case Here is complete story

అల్లు అర్జున్ సరసన అసలు ఆమె అలా కనిపించదు కూడా. ఇలా పదిహేనేళ్లకే కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక అక్కడ నుంచి హిందీ కంటే ఎక్కువ తెలుగు సహా తమిళ సినిమాలు చేస్తూ సౌత్ లోనే బిజీగా మారింది. ఇలా కొన్నేళ్లపాటు తన హవా చూపించింది కానీ నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవ్వడం కూడా మొదలైంది. కాగా ఇలా గత 2022 ఏడాదిలో హన్సిక అన్నేళ్ల సినిమా లైఫ్ నుంచి పెళ్లి చేసుకొని షాకిచ్చింది.

చాలా సింపుల్ గా పెళ్లి చేసేసుకుంది కానీ తాజాగా ఈ హీరోయిన్ పై గృహ హింస కేసుకు సంబంధించి వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ గృహ హింస కేసులు అనేవి దాదాపు భర్తలపై భార్యలు పెడుతుంటారు అని ఎక్కువగా వింటుంటారు. కానీ ఇక్కడ హన్సిక మీద ఆమె భర్త పెట్టాడా అంటే? సమాధానం కాదు అని తెలుస్తుంది. మరి హన్సిక మీద గృహ హింస కేసు పెట్టడం ఏంటి అనేది ఆరా తీస్తే అసలు విషయం బయటకి వచ్చింది.

కాగా హన్సికకి ఓ సోదరుడు ఉన్నాడు. ప్రశాంత్ మోత్వానీకి హన్సిక కంటే ముందే 2020 లో వివాహం జరిగింది. కాగా తనకి తన భార్యకి సరైన సఖ్యత లేని నేపథ్యంలో తన భార్య అతనిపై సహా హన్సిక ఇంకా వారి అమ్మపై కూడా గృహ హింస కేసును పెట్టిందట. కాగా గత కొన్నాళ్ల నుంచి సాగుతున్న ఈ కేసు నుంచి తనని తన తల్లిని తప్పించాలని తనకి సంబంధం లేదు అన్నట్టుగా ముంబై కోర్ట్ ని ఆమె ఆశ్రయించిందట.

దీనిపై ప్రస్తుతం వాదోపవాదనలు ఇరు పక్షాల వైపు జరుగుతున్నాయట. అలాగే ప్రస్తుతం ముందస్తు బెయిల్ లో హన్సిక ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కేసు విషయంలో హన్సికకి ఎలాంటి తీర్పు దక్కుతుందో చూడాలి. మరి కాగా హన్సిక ఇపుడు తెలుగులోనే పలు సోలో సినిమాలు చేస్తుండగా వాటితో పాటుగా పలు రియాలిటీ షోస్ లో న్యాయ నిర్ణేతగా కూడా చేస్తున్నారు. హీరోయిన్ గా అయితే ప్రస్తుతం తనకి ఎలాంటి అవకాశాలు లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X