షూటింగ్‌లో హన్సికకు గాయాలు.. అయినా కూడా!
ఆపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం తన 50వ చిత్రం మహాలో నటిస్తోంది. వివాదాస్పద ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక రక్తంతో నిండిఉన్న బాత్ టబ్ లో ఉన్న పోస్టర్ కూడా ఆ మధ్యన వైరల్ అయింది. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ పోస్టర్ చాలు.
ఇదిలా ఉండగా మహా చిత్ర షూటింగ్ లో హన్సిక గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో హన్సిక జారి పడిందట. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయాలు లెక్కచేయకుండా హన్సిక ప్రాధమిక చికిత్స తీసుకుని షూటింగ్ లో పాల్గొందట. తన 50 వ చిత్రం కావడంతో మహాని హన్సిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జమీల్ ఈ చిత్రానికి దర్శకుడు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హన్సికకు ఇటీవల టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. అందుకే ఎక్కువగా తమిళ చిత్రాలపైనే దృష్టిపెట్టింది ఈ భామ. టీనేజ్ లోనే సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











