రెండు రోజుల్లో వ్యాపారవేత్తతో హన్సిక పెళ్లి.. కాబోయే భర్త ఎవరంటే!
కామన్ మ్యాన్‌కు కూడా సోషల్ మీడియా చేరువైన తర్వాత సినీ తారలపై రూమర్లు తెగ ప్రచారం కావడం జరుగుతుండటం తెలిసిందే. కొన్నిసార్లైతే ఎక్కడి నుంచి వార్తలు పుడుతాయో అర్ధం కాకుండా ఉంటుంది. తాజాగా ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విడిపోయారు అంటూ విరుష్క డైవోర్స్ హ్యాష్ ట్యాగ్‌తో జాతీయస్థాయిలో ట్రెండ్ అయింది. ఇక రెండు రోజుల క్రితం రానా, మిహికా పెళ్లి వాయిదా పడిందనే వార్తలపై దగ్గుబాటి స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి వార్తనే ఇప్పుడు హన్సికను వెంటాడింది. వివరాల్లోకి వెళితే..

హన్సిక మోత్వాని పెళ్లి వార్త
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆగ్రతార హన్సిక మోత్వాని పెళ్లి చేసుకోబోతున్నారు. చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తను రెండో రోజుల్లో ఆమె వివాహం చేసుకోబోతున్నారనే వార్త తమిళ మీడియాలో సంచలనం రేపింది. దాంతో ఆమె ఎవరిని? ఎప్పుడు? ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాలపై ఆరా తీయడంతో ఈ వార్త సంచలనంగా మారింది.

తమిళ పత్రిక ట్విట్టర్ పేజ్‌లో
తమిళంలో సినీ పత్రికకు సంబంధించిన సోషల్ మీడియాలో అకౌంట్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తను ప్రచురించింది. హీరోయిన్ హన్సిక రెండు రోజుల్లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు ఆ వార్తపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విపరీతంగా కామెంట్లు పెట్టారు.

రబ్బిష్.. ఓ మైగాడ్ అంటూ
తన పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తుండటంతో హీరోయిన్ హన్సిక స్పందించారు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్టు పెడుతూ రబ్బిష్.. ఓ మైగాడ్ ఎవరతను, నాకు తెలియకుండా నాకు పెళ్లా అంటూ ప్రశ్నించారు. ఆమె ట్వీట్‌కు కొందరు రిప్లై ఇస్తూ మాకు ఎందుకు ఛెప్పలేదు.. కంగ్రాట్స్.. మీకు పెళ్లా? అలాంటిది జరుగొద్దు అంటూ రకరకాల కామెంట్లతో ట్వీట్లు చేశారు. దీంతో హన్సిక పెళ్లి వార్త ఓ పుకారు అని చివరకు తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు.

గతంలో శింబుతో బ్రేకప్
గతంలో హన్సిక మోత్వాని హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే వారిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆత ర్వాత శింబు గానీ, హన్సిక గానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అయితే వారి అఫైర్ బ్రేకప్ కావడానికి కారణం ఏమిటనే విషయం అంతుచిక్కకుండా మారింది.
Recommended Video

తాజా మాజీ ప్రియుడితో మూవీ
ఇక తాజాగా తన మాజీ ప్రియుడు శింబుతో ఓ సినిమాలో నటించడానికి హన్సిక సిద్ధం కావడం తమిళ పరిశ్రమలో ఆసక్తిని రేపింది. హీరోయిన్‌కు ప్రధాన్యం ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న మహా అనే చిత్రంలో శింబు, హన్సిక కలిసి నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యమైంది.


Click it and Unblock the Notifications











