భర్తతో హన్సిక మోత్వానీ తెగతెంపులు.. 4 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై
దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి హన్సికా మొత్వాని (Hansika Motwani). ఈ అమ్మడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హన్సిక తన భర్త, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా (Sohail Kathuria)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా కోర్టు ఈ జంట విడాకులను అధికారికంగా మంజూరు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
హన్సిక మోత్వానీ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలనటిగా టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించిన ఆమె, తర్వాత హీరోయిన్‌గా సినీ రంగంలోకి ప్రవేశించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. అదే సమయంలో తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారింది.

ప్రేమ వివాహం... ఘనంగా పెళ్లి
హన్సిక తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ కతూరియాని ప్రేమించింది. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత 2022 డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజకుటుంబ శైలిలో జరిగిన ఈ పెళ్లి వేడుక అప్పట్లో సోషల్ మీడియాలో కూడా భారీగా వైరల్ అయింది. అయితే సోహైల్‌కు ఇది రెండో వివాహం కావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయనకు ముందుగా హన్సిక స్నేహితురాలు రింకీ బజాజ్ తో వివాహం జరిగింది. కొంతకాలానికి ఆ వివాహం విడిపోయిన తర్వాత సోహైల్‌కు హన్సిక దగ్గరయ్యారని వార్తలు వచ్చాయి.
గతంలోనే వివాదాలు
హన్సిక పెళ్లి సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సోహైల్ తొలి భార్య హన్సిక స్నేహితురాలు కావడం పెద్ద చర్చకు దారితీసింది. అప్పుడు హన్సిక ఈ విషయంపై స్పందిస్తూ.. 'సోహైల్ గతం నాకు తెలుసు. కానీ వారి విడాకులకు నేను కారణం కాదు' అని స్పష్టం చేసింది. అయితే.. పెళ్లైన తర్వాత కొంతకాలం ఈ జంట సంతోషంగా ఉన్నట్లు కనిపించినా, గత ఏడాది నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి.
కొంతకాలంగా హన్సిక తన భర్తకు దూరంగా ఉంటూ, తన తల్లితో కలిసి ఉంటున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో భర్తతో ఉన్న ఫోటోలను తొలగించడంతో విడాకుల పుకార్లు మరింత బలపడ్డాయి. ఇప్పుడేమో ముంబై బాంద్రా కోర్టు వీరి విడాకులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే విడాకులకు గల అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ జంట విడిపోయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పెళ్లైన నాలుగేళ్లకే ఈ జంట విడిపోయారని వస్తున్న వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు హన్సిక గానీ, సోహైల్ కతూరియా గానీ అధికారికంగా స్పందించలేదు. మొత్తానికి, ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన హన్సిక వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











