Hansika Motwani: జీవితంలో అలా రాంగ్ ట్రైన్ ఎక్కా.. విడాకులపై హన్సిక ఫస్ట్ రియాక్షన్

సినీ పరిశ్రమలో విడాకులు, బ్రేకప్స్, ఎఫైర్లు, డేటింగ్స్ సర్వసాధారణం అయిపోయాయి. ఎప్పుడు ఎవరు? విడాకుల బాంబు పేలుస్తారోనని నటీనటుల అభిమానులు షాక్ అవుతున్నారు. తమ జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయినా, ఫోటోలు డిలీట్ చేసినా ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది తన భర్త నుంచి విడాకులు తీసుకుని షాకిచ్చాన స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ. తద్వారా గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్‌కు ఆమె తెరదించారు. విడాకుల తర్వాత తొలిసారిగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక.. తన వైవాహిక జీవితం, రిలేషన్‌షిప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హన్సిక. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురుతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. కందిరీగ, బిల్లా, మస్కా, కంత్రీ, దేనికైనా రెడీ తదితర చిత్రాలలో నటించింది. తమిళ స్టార్ హీరో శింబుతో డేటింగ్ చేసి పెళ్లి వరకు వెళ్లిన హన్సిక ఆయనతో బ్రేకప్ చెప్పేసింది. విపరీతంగా బరువు పెరిగిపోవడంతో పాటు కొత్త అమ్మాయిల నుంచి పోటీతో రేసులో వెనకబడ్డారు. వర్కవుట్స్ చేసి సన్నబడినప్పటికీ మునపటి ఛార్మ్ కనిపించలేదు. ఒకటి ఆరా సినిమాల్లో నటించినప్పటికీ అవి డిజాస్టర్‌గా నిలిచాయి. అలా స్టార్ హీరోయిన్ నుంచి ఫేడవుట్ అయిపోయే స్థాయికి చేరుకుంది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడా హన్సికకు అదృష్టం కలిసిరాలేదు.

Hansika Motwani Opens Up on Divorce Mental Health and Moving On Strongly

ఈ దశలో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్న హన్సిక.. తన చిన్ననాటి మిత్రుడు సొహైల్ ఖతూరియాతో ప్రేమలో పడి, కరోనా సమయంలో ప్రియుడిని పెళ్లాడింది. అయితే అప్పటికే సొహైల్‌కు పెళ్లయ్యింది. అయితే హన్సిక- సొహైల్ మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయని, ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని మీడియాలో గాసిప్స్ వచ్చాయి. అంతలోనే సొహైల్‌తో ఉన్న ఫోటోలు, వీడియోలను హన్సిక డిలీట్ చేయడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

ఇద్దరూ వేర్వేరుగా ఉండటం, ఒంటరిగా పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం, హన్సిక ఎక్కువగా తల్లితోనే కనిపించడంతో ఏదో జరుగుతుందని మీడియా భావించింది. చివరికి సొహైల్‌ ఖతూరియాతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి హన్సిక తన అభిమానులకు షాకిచ్చారు. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడిపోతున్నారని.. సొహైల్ నుంచి ఎలాంటి భరణం కూడా హన్సిక కోరలేదని సన్నిహితులు పేర్కొన్నారు. విడాకుల తర్వాత విహారయాత్రలు, ఆధ్యాత్మిక వాతావరణంలో హన్సిక గడుపుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా.. ఒంటరితనం నాకెప్పుడూ ఇష్టమే. నా వాళ్ల కోసం సమయాన్ని గడపటం, నాకు నచ్చినట్లుగా ఉండటం చేస్తున్నా. ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. విడాకులు తీసుకోవడంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. రాంగ్ ట్రైన్ ఎక్కామని గ్రహించినప్పుడు వెంటనే దిగిపోవడమే మంచిది. అయినా ప్రజలకు కావాల్సింది హైడ్ లైన్స్, క్లిక్ బైట్స్... అలా నాపై ఎన్నో వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు, ఇవ్వను. నా జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, సంతోషమే ముఖ్యం. విడాకుల విషయం పూర్తిగా నా వ్యక్తిగతం.. అవి బయటకు వెళ్లడానికి వీల్లేదు. అమ్మ, సోదరుడు ఈ పరిస్ధితుల్లో నాకు అండగా నిలిచి, సహకరించారు అని హన్సిక పేర్కొన్నారు.

నీ బాధ మరొకరికి వినోదం కాకూడదని అమ్మ నాతో చెప్పింది. అందుకే నేను మునిపోతున్నా సరే ఆ విషయం ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఆ బాధను నేను అనుభవించాక, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. పెళ్లి అనేది సహచర్యాన్ని, స్థిరత్వాన్ని, ఎదుగుదలను సూచించాలి. దురదృష్టవశాత్తూ నాకు ఆ విషయాలన్నీ కదిలిపోయాయి. ఎప్పుడూ సరదాగా, సంతోషంగా ఉండే నేను మౌనంగా, బాధతో ఉండటం చూసి నా తల్లి, సోదరుడు కంగారుపడ్డారు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, అండగా నిలుస్తామని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం ఆ ఇద్దరికీ మాత్రమే తెలుస్తుంది. దానిపై మూడో వ్యక్తి స్పందించలేరు. గడిచిన రెండేళ్లుగా నా మానసిక ఆరోగ్యంగా దృష్టి పెట్టాను. నా స్నేహితురాలు ఓ డాక్టర్‌ను సంప్రదించి నాకు థెరపీ చేయించింది. ఈ రెండేళ్ల కాలం జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పరిస్ధితిని అయినా ఎలా ఎదుర్కోవాలో చూపించింది అని హన్సిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: hansika motwani movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X