Hansika Motwani Divorce: సొహైల్‌తో తెగతెంపులు.. విడాకులపై హన్సిక ఫస్ట్ రియాక్షన్

దేశంలో సెలబ్రిటీ విడాకుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన సతీమణి సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ షాకిచ్చారు. గత కొంతకాలంగా ఆమె విడాకులు తీసుకోబోతుందన్న వార్తలను నిజం చేస్తూ భర్త సొహైల్ ఖతూరియాతో 4 ఏళ్ల వైవాహిక బంధానికి హన్సిక ముగింపు పలికారు. విడాకుల అనంతరం హన్సిక తొలిసారిగా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయ్యారు హన్సిక. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురుతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. కందిరీగ, బిల్లా, మస్కా, కంత్రీ, దేనికైనా రెడీ తదితర చిత్రాలలో నటించింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లలో అలరించారు హన్సిక మోత్వానీ. ఈ దశలో తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన హన్సిక ఆయనతో పెళ్లి వరకు వెళ్లింది.

Hansika Motwani Reacts After Divorce with Sohael Kathuria Shares Chardi Kala Always Message on Instagram

ఆ తర్వాత విపరీతంగా బరువు పెరిగిపోయిన హన్సిక తన మునుపటి ఛార్మ్‌ను కోల్పోయారు. దానికి తోడు కొత్త అందాలు దూసుకురావడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఒకటి రెండు సినిమాలలో నటించినా అవి పెద్దగా హిట్ కాకపోవడంతో నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయింది హన్సిక. అనంతరం కొన్ని హిందీ, తెలుగు ఛానెళ్లలో హన్సిక.. జడ్జిగా కనిపించి షాకిచ్చారు. తన చిన్ననాటి మిత్రుడు సొహైల్ ఖతూరియాతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనను పెళ్లాడింది. అయితే అప్పటికే సొహైల్‌కు పెళ్లయ్యింది.

కొంతకాలం ఈ జంట అన్యోన్యంగానే ఉంది. అయితే అనూహ్యంగా హన్సిక- సొహైల్ విడిపోతున్నట్లు మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. సొహైల్‌తో ఉన్న ఫోటోలు, వీడియోలను హన్సిక డిలీట్ చేయడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఒంటరిగా పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం, ఎక్కువగా తల్లితోనే కనిపించడంతో హన్సిక విడాకులు కన్ఫర్మ్ అనుకున్నారు. తర్వాత ఎందుకో ఈ వార్తలు సద్దుమణిగాయి. అయితే అనూహ్యంగా సొహైల్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి హన్సిక తన అభిమానులకు షాకిచ్చారు. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడిపోతున్నారని.. సొహైల్ నుంచి ఎలాంటి భరణం కూడా హన్సిక కోరలేదని సన్నిహితులు పేర్కొన్నారు.

విడాకుల ప్రక్రియ సాఫీగా ముగియడంతో హన్సిక మోత్వానీ తొలిసారిగా స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో చార్దీ కాలా ఆల్‌వేస్ అంటూ పంజాబీలో పోస్ట్ పెట్టారు. దీనికి అర్ధం కష్టకాలంలో కూడా ధర్యంగా, పాజిటివ్ దృక్పథంలో ముందుకు సాగడం. ఈ పోస్ట్ ద్వారా తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న క్లిష్ట పరిస్ధితులను ధైర్యంగా ఎదుర్కొంటానని అభిమానులకు హన్సిక తెలియజేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలంటూ నెటిజన్లు హన్సిక పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు. విడాకుల నేపథ్యంలో హన్సిక తన కెరీర్‌ను ఎలా కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తిరిగి సినిమాల్లో అడుగుపెడతారా? లేక మరో కొత్త అవతారంలో ముందుకొస్తారా? అనేది వేచిచూడాలి.

Read more about: hansika motwani movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X