హన్సిక మరోసారి అదే బాట.. ఆది పినిశెట్టి కీలక పాత్రలో!
ఆపిల్ పిల్లగా యువత హృదయాల్లో గూడు కట్టుకున్న హన్సిక తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టీనేజ్ వయసులో దేశముదురు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అందాలు ఆరబోసింది. ఆ ఆపిల్ బ్యూటీ గ్లామర్ కు యువత ఫిదా అయిపోయారు. ప్రస్తుతం హన్సిక తమిళ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. తన గ్లామర్ తో యువతని ఒక ఊపుఊపిన హన్సిక ప్రస్తుతం లేడి ఓరియంటెడ్ చిత్రాలు మాత్రమే పరిమితం అయిపోయింది.
హన్సిక ప్రస్తుతం తన 50వ చిత్రం మహాలో నటిస్తోంది. ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. తాజాగా మరో లేడీఓరియేంటేడ్ చిత్రాన్ని కూడా హన్సిక ప్రారంభించింది. మనోజ్ దామోదరన్ ఈ చిత్రానికి దర్శకుడు. పాట్నర్ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తుండగా హీరో ఆది ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో దర్శకుడు హాస్యాన్ని హైలైట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో పాలక్ లల్వాని మరో హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











