HBD Kiara Advani: హ్యాపీ బర్త్ డే కియారా.. గేమ్ ఛేంజర్‌లో జాబిలమ్మ లుక్ ట్రెండింగ్

ఇండియన్ సినిమా రంగంలో ప్రతిభతోపాటు అందంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జూలై 31వ తేదీన జన్మదినం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తాజాగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోని లుక్‌ను అభిమానులకు పరిచయం చేశారు. కియారా అద్వానీ బర్త్ డే, గేమ్ ఛేంజర్ సినిమా విషయంలోకి వెళితే..

హిందీ, తెలుగు, ఇతర భాషల్లో రాణిస్తున్న కియారా అద్వానీ తన 34వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె కెరీర్, గృహస్త జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొంటూ వెళ్తున్నారు. ఆమె భారీ బడ్జెట్ ప్రాజెక్టులో భాగమవుతున్నారు.

Happy Birth Day Kiara Advani Her Jabilamma Looks of Game Changer Trending

అయితే కియారా అద్వానీ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ చిత్రంలో ఆమె జాబిలమ్మగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలోని అందాలు విరజిమ్ముతున్న లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. రాంచరణ్‌తో కలిసి నటించిన జరగండి సాంగ్‌లోని బ్యూటీఫుల్ లుక్‌‌ను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్ డే కియారా అంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు.

గేమ్ ఛేంజర్ చిత్రంలో జాబిలమ్మగా కియారా అద్వానీ నటించారు. ఆమె తన వైబ్రెంట్ ఎనర్జీతో మీ హృదయాలను దోచుకోవడం ఖాయం అంటూ నిర్మాతలు, చిత్ర యూనిట్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

Happy Birth Day Kiara Advani Her Jabilamma Looks of Game Changer Trending

గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇక ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానున్నది. చాలాకాలంగా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, ఇండియన్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల జుగ్ జుగ్ జీయో, గోవిందా నామ్ మేరా, సత్యప్రేమ్ కి కథ సినిమాల్లో నటించారు. ఇక ఆమె నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. వార్ 2 చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X