For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBDKajalAggarwal: చిరంజీవి, నాగ్‌తో కలిసి కాజల్ నేషనల్ రికార్డు.. ఎన్టీఆర్ కోసమే అలా చేసిన బ్యూటీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకుంటారు. అలా దాదాపు పదేళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది చందమామ కాజల్ అగర్వాల్. అద్భుతమైన అందంతో పాటు మైమరపించే నటనతో ఎంతో కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకుంటోంది. ఇక, ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్‌ను తెలుసుకుందాం!

   అలా మొదలైన కెరీర్.. బాగా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. బాగా ఫేమస్

  కెరీర్ ఆరంభంలోనే హిందీ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్.. ‘లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అదరగొట్టడంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోయింది. ఆ సమయంలోన తమిళ సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అక్కడా ఇక్కడా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది.

  టాలీవుడ్‌లో స్టార్‌గా.. రెమ్యూనరేషన్

  టాలీవుడ్‌లో స్టార్‌గా.. రెమ్యూనరేషన్

  కెరీర్ ఆరంభంలో చిన్న హీరోలతో సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత బడా చిత్రాల్లో భాగం అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసి మెప్పించింది. దీంతో చాలా కాలం పాటు హవాను చూపించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఫలితంగా రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటూ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పుకుంది.

  అన్ని భాషల్లోనూ హవా.. అవార్డులు

  అన్ని భాషల్లోనూ హవా.. అవార్డులు

  కాజల్ అగర్వాల్ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. తమిళం, హిందీ భాషల్లోనూ ఆమె మూవీలు ఉన్నాయి. అక్కడ కూడా స్టార్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ.. నటించిన ప్రతి చోటా మంచి పేరును సంపాదించుకుంది. ఫలితంగా ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకుందామె.

   బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమ.. వివాహంతో

  బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమ.. వివాహంతో

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత 2020 అక్టోబర్ 30న వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తోందామె.

  చిరు.. నాగ్‌తో కలిసి నేషనల్ రికార్డు

  చిరు.. నాగ్‌తో కలిసి నేషనల్ రికార్డు

  సుదీర్ఘమైన కెరీర్‌లో కాజల్ అగర్వాల్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఆమె ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య'తో పాటు నాగార్జునతో ఓ సినిమాలో నటిస్తోంది. అయితే, వీటి కంటే ముందే వీళ్ల కొడుకులు రామ్ చరణ్, నాగ చైతన్యతో కలిసి సినిమాలు చేసిందామె. ఇలా కొడుకుల తర్వాత తండ్రులతో సినిమాలు చేసిన హీరోయిన్‌గా ఆమె నేషనల్ రికార్డును క్రియేట్ చేసింది.

  అందులో యమా యాక్టివ్‌గా ఉంటూ

  అందులో యమా యాక్టివ్‌గా ఉంటూ

  సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఎనలేని ఫాలోయింగ్‌ను అందుకుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఎన్టీఆర్ కోసమే అలా చేసిన బ్యూటీ

  ఎన్టీఆర్ కోసమే అలా చేసిన బ్యూటీ

  సుదీర్ఘమైన కెరీర్‌లో కాజల్ అగర్వాల్ ఒకే ఒక్క సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్'లో ఆమె ‘పక్కా లోకల్' అనే సాంగ్‌లో ఆడిపాడింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఈ సాంగ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆరే కారణం అని చెప్పిందామె. అతడి కోసమే ఇది ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Birthday Today. On The Occasion of Her Birthday.. We Shared Some Best Moments of This Heroine Career
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X