happy birthday keerthy suresh: SVP గ్లామరస్ లుక్ వైరల్.. మహేష్ బాబు స్పెషల్ విషెస్!

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ గ్లామరస్ హీరోయిన్స్ మాత్రమే స్టార్ డమ్ ను ఈజీగా అందుకుంటారు అనే అపోహలకు కొంతమంది హీరోయిన్స్ కౌంటర్స్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో కూడా నటనతో పాటు మంచి పాత్రలతో కూడా హై రేంజ్ లో క్రేజ్ అందుకోవచ్చు అని కొంతమంది నిరూపిస్తున్నారు. అలాంటి అతి కొద్ది మంది హీరోయిన్స్ లలో కీర్తి సురేష్ ఒకరు. చాలావరకు కీర్తి సురేష్ ఏ సినిమాలో అయినా సరే వీలైనంతవరకు ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుంది. ఇక పాత్రకు అవసరమైతే తప్ప ఆమె పెద్దగా గ్లామర్ పాత్రల్లో కనిపించదు. పెద్ద సినిమాల్లో కూడా గ్లామర్ గీత దాటకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది.

ఇక మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ దాదాపు తన కెరీర్ మొత్తానికే సరిపోయేంత క్రేజ్ ను అందుకుందని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ తొందరపడకుండా కేవలం తనకు సూటయ్యే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. కీర్తి సురేష్ 31 వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

happy birthday keerthy suresh new still release from svp movie

కీర్తి సురేష్ కు మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు కీర్తి సురేష్ మొదటిసారి సర్కారు వారి పాట సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని మొదటి పాటను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు అందులో. కీర్తి సురేష్ తో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. సినిమా సినిమాకు తనలోని సరికొత్త హావభావాలను హైలెట్ చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో తప్పకుండా మరొక బాక్సాఫీస్ హిట్ తన ఖాతాలో వేసుకుంతుంది అని అర్థమవుతుంది.

ఇక మహేష్ బాబు కీర్తి సురేష్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ అందిస్తూ ఎన్నో విజయాలను అలాగే నిత్యం సంతోషంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశాడు. ఇక సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు కూడా సరి కొత్తగా కనిపించబోతున్నాడు. బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక నేరాల నేపథ్యంలో అలాగే రైతులకు సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. దర్శకుడు పరశురామ్ ఇప్పటికే ఈ సినిమా పై ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X