Happy birthday sai pallavi: సాయి పల్లవిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. త్రిశూలం పట్టి నిప్పులు చిమ్ముతూ
సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా వెండితెరపై చాలా కొత్తగా ఉంటుంది. అందరి హీరోయిన్స్ లా కాకుండా ప్రేక్షకులను విభిన్నంగా ఆకట్టుకోవాలని ట్రై చేస్తుంటుంది. అలాగని గ్లామర్ డోస్ ఎప్పుడు పెంచలేదు. పాత్ర నచ్చితే కొన్నిసార్లు చిన్న తరహా ప్రయోగాలు కూడా చేస్తుంటుంది. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు మొదటిసారి ఒక ఉగ్రరూపంతో దర్శనమిచ్చింది. శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం తన విశ్వరూపాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్కును రిలీజ్ చేశారు.

ఆ ఒక్క సినిమాతో..
సాయి పల్లవి మలయాళీ అమ్మాయి అయినప్పటికీ ఆమెకు తెలుగులోనే భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసినా ఫిదా సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో అమ్మడికి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి.

కథ నచ్చకపోతే..
ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా సాయి పల్లవి తనకు సెట్టయిన కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే చేసే పాత్రకు వాల్యూ ఉంటేనే ఒప్పుకుంటోంది. కథ నచ్చకపోతే కొంతమంది అగ్ర హీరోలను అలాగే స్టార్ దర్శకులకు కూడా ఆమె నో చెప్పిన సందర్బాలు ఉన్నాయి. ఇక గ్లామర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటోంది.

చేతిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు
ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. చూస్తుంటే ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాయనిపిస్తోంది. శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న విరాటపర్వం సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి.

త్రిశూలంతో నిప్పులు చిమ్ముతూ..
ఇక నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలో సాయి పల్లవి నెవర్ బిఫోర్ అనేలా దర్శనమివ్వనుందని అర్ధమయ్యింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో అమ్మవారిలా త్రిశూలంతో నిప్పులు చిమ్ముతున్నట్లు స్టిల్ ఇచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











