Happy Birthday Sai Pallavi: ఆ విధంగా బ్యాడ్ కాకుండా.. 15కోట్లు వదిలేసుకున్న ఏకైక హీరోయిన్!
సినిమా ప్రపంచంలో గ్లామరస్ బ్యూటీలు చాలా మంది ఉంటారు కానీ టాలెంట్ తో ఎక్కువగా ఆకట్టుకునే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అతి కొద్ది మంది హీరోయిన్స్ లలో సాయి పల్లవి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోతుంటాయి. ఇక నేడు సాయిపల్లవి 30వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఆమెకు విషెస్ అందిస్తున్నారు. ఇక సాయి పల్లవి ఒక విషయంలో బ్యాడ్ కాకుండా దాదాపు 15కోట్ల ఆదాయాన్ని మిస్ చేసుకుందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట డ్యాన్సర్ గా..
సాయి పల్లవి మొదట ఒక డాన్సర్ గా నా కెరీర్ మొదలు పెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ ను ఏ మాత్రం విడిచిపెట్టకూడదు అని ఆమె కొన్ని రియాలిటీ షోలలో స్పెషల్ పర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. అయితే అవి ఆమెకు అంతగా గుర్తింపును అందించలేకపోయాయి. ఇక మలయాళం చిత్రపరిశ్రమలో మొదట ప్రేమమ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది.

మొదటి సినిమాతో..
ప్రేమమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ కావడంతో అందులో అందరికంటే ఎక్కువగా సాయి పల్లవి నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సాయి పల్లవి ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక విధంగా తన మొదటి సినిమాతోనే సాయి పల్లవి మిగతా భాషల్లో కూడా మంచి క్రేజ్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ తరువాత..
ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ కూడా సాయి పల్లవి కి ఎక్కువగా క్రేజ్ వచ్చింది. అయితే మొదటి సినిమాకి కేవలం 15 లక్షల వరకు పారితోషికం అందుకున్న సాయి పల్లవి ఫిదా సినిమా తర్వాత తన పారితోషికాన్ని కోటి రూపాయలకు పెంచేసింది. అయితే ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాలతో సాయి పల్లవికి ఊహించని ఫలితాలు వచ్చాయి.

లవ్ స్టోరీ సినిమాతో..
ఫిదా సినిమా తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు.. ఇలా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి సక్సెస్ ను అందించిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఐతే అందుకుంది. అలాగే నానితో చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మెగాస్టార్ మూవీ రిజెక్ట్
ఇక ప్రస్తుతం అయితే వరుస విజయాలు రావడంతో సాయి పల్లకి అగ్రహీరోలతో నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ ఈ బ్యూటీ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఓకే చేసుకుంటూ వెళ్ళింది. ఆ మధ్య కాలంలో మెగా స్టార్ బోళా శంకర్ సినిమాలో ఒక పాత్రకోసం సంప్రదించగా ఆమె రీమిక్స్ సినిమాలు చేయను అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విధంగా సాయి పల్లవి కొన్ని పెద్ద సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది.

అలా సంపాదించడం ఇష్టం లేక..
ఇక సాయి పల్లవి కొన్నికమర్షియల్ యాడ్స్ లో నటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆమె అటువైపుగా ఆదాయాన్ని సంపాదించుకోవాలని అనుకోలేదు. నేచురల్ గా ఉండటమే తనకు ఇష్టమని బ్యూటీకి కి సంబంధించిన వాటిని ప్రమోట్ చేయకుండా మనకు చిరునవ్వు కంటే గొప్ప బ్యూటీనెస్ మరొకటి లేదని తన క్యారెక్టర్ ఏమిటో చెప్పేసింది. ఒక విధంగా సాయి పల్లవి ఒక మంచి క్యారెక్టర్ కొనసాగుతోంది అని చెప్పాలి.

అలా 15 కోట్లు వదులుకున్న బ్యూటీ
ఇటీవల కాలంలో సెలబ్రెటీ హోదాతో చాలామంది నలువైపులా ఆదాయాన్ని అందుకునే విధంగా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. కానీ సాయి సాయి పల్లవి మాత్రం అలా వెళ్లకుండా మంచి నటిగా ముందుకు సాగుతోంది. ఒకవేళ సాయి పల్లవి ఆ విధంగా ప్రయత్నం చేసి ఉంటే మాత్రం ఆమెకి ఇప్పటివరకు 15 కోట్ల వరకు వచ్చి ఉండేవి. ఇక ప్రస్తుతం సాయి పల్లవి నుంచి విరాటపర్వం సినిమాతో పాట మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











