Happy Birthday Samantha: 33 ఏళ్ల ఓ బేబీ.. మీకు తెలియని సమంత సీక్రెట్స్..

ఏం మాయ చేశావే చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత రుత్ ప్రభు అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నది. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్, వరుస విజయాలను ఖాతాలో వేసుకొంటున్న సమంత తన 32వ జన్మదినాన్ని ఏప్రిల్ 28న జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సమంత గురించి కొన్ని విషయాలు..

Recommended Video

Happy Birthday Samantha: Baby Samantha Akkineni Turns 33
టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసి..

టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసి..

ఏం మాయ చేసావే సినిమా షూటింగ్‌లో చైతూతో జరిగిన పరిచయం పెళ్లివైపు అడుగులు వేసేలా చేసింది. 2017లో సమంత, చైతూ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొన్నారు. జనవరి 2017లో ఎంగేజ్‌మెంట్ జరుగగా, అక్టోబర్ 6న హిందూ, 7వ తేదీన క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసుకొంటూ వస్తున్నారు.

చైతూతో క్వారంటైన్‌లో

చైతూతో క్వారంటైన్‌లో

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా భర్త నాగచైతన్యతో సమంత అక్కినేని క్వారంటైన్‌లో ఉన్నారు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా పోయినా ఆమె ఈ మధ్యలోనే మళ్లీ కనిపించారు. గాఢ నిద్ర తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టానని కామెంట్ చేశారు. తాజాగా తన కుటుంబ సభ్యులతో 33వ జన్మదిన్నాన్ని జరుపుకొంటున్నారు. సమంత కోసం చైతూ ప్రత్యేకంగా కేక్‌ను కూడా తయారు చేశాడని సమంత తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించింది.

సమంత కెరీర్ ఇలా..

సమంత కెరీర్ ఇలా..

సమంత కెరీర్‌లో ఉత్తమ చిత్రాలను తీసుకొంటే.. ఏం మాయ చేశావే చిత్రంతో మొదలు పెడితే.. ఈగ, అఆ, యూటర్న్, సూపర్ డీలక్స్, రంగస్థలం, ఓ బేబీ, మహానటి, జాను చిత్రాలు ఆమె కీరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ఇక తాజాగా తమిళంలో రెండు ప్రాజెక్టులను అంగీకరించింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో మరో హారర్ చిత్రంలో నటించనున్నారు. కన్నడలో బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్‌లో నటించనున్నారు. అలాగే మనోజ్ బాజ్‌పేయ్‌తో ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

సమంత రికార్డ్స్

సమంత రికార్డ్స్

సమంత కెరీర్‌ను చూసుకొంటే.. 42 సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆమె నటించిన రెండు చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇక 6 చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సమంత రికార్డు బ్రహ్మండంగా ఉంది. ఆమె నటించిన 15 చిత్రాలు 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం విశేషం. కెరీర్‌లో 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు మొత్తం 33 అవార్డులను సమంత సొంతం చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X