twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Sreeleela: టాలీవుడ్ లో బిజీబిజీగా పెళ్లి సందD బ్యూటీ.. రాబోయే సినిమాలు ఇవే!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది అగ్ర హీరోయిన్స్ తో నటించడానికి స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆడియెన్స్ కూడా హీరో హీరోయిన్ కాంబినేషన్ ను ఒకసారి చూశాక మళ్ళీ రిపీట్ అయితే చూడడానికి ఇష్టపడటం లేదు. అందుకే హీరోలు కూడా స్టార్ హీరోయిన్స్ ను సైతం పెద్దగా రిపీట్ చేయడం లేదు.

    కానీ భారీ స్థాయిలో స్టార్ హోదా ఉంటే మాత్రం కొంతమంది హీరోయిన్స్ అగ్రహీరోలతో మళ్లీ మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు అందుకోవడానికి శ్రీలీల గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంది.

    Happy birthday sreeleela tollywood upcoming interesting projects

    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన శ్రీలీల మొదటి సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో చేసిన విషయం తెలిసిందే శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక నేడు శ్రీల 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.

    ముఖ్యంగా శ్రీలీలకు సంబంధించిన రాబోయే సినిమాల గురించి కూడా నిర్మాణ సంస్థలు అప్డేట్ ఇస్తూ విషెస్ అందిస్తున్నాయి. ఇక సితార ఎంటర్టైన్మెంట్లో ఈ బ్యూటీ అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే మరొకవైపు మెగా హీరో వైష్ణవ తేజ్ రాబోయే కొత్త సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

    ఇక శ్రీలీల ఇప్పటికే రవితేజతో ధమాకా అనే సినిమా పూర్తి చేసింది. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో రాబోయే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ బాలయ్య బాబుకు కూతురి పాత్రలో కనిపించబోతోంది. మరి ఈ అవకాశాలతో శ్రీలీల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Happy birthday sreeleela tollywood upcoming interesting projects
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X