అక్కడ మచ్చ చూపిస్తూ కవ్వింపులు.. పబ్లిక్‌గా వీరమల్లు హీరోయిన్ అరాచకం!

అందం , అభినయం ఉన్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్‌గా రాణించలేక బండిని లాగిస్తుంటారు. చివరికి సెకండ్ హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్ చేసేందుకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సరిపెట్టుకోవాల్సి వస్తుంది . ఈ కోవలోకే వస్తారు పూజిత పొన్నాడ. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న ఈ భామ ఎందుకో స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. చివరికి సెకండ్ లీడ్‌గా చిన్నా చితకా పాత్రలు చేస్తోంది.

విశాఖపట్నానికి చెందిన పూజిత చెన్నైలో పుట్టి పెరిగారు. బీటెక్ పట్టభద్రురాలైన ఈ అమ్మడు చదువు పూర్తయ్యక కొంతకాలం టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే సినిమాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని పక్కనపెట్టిన పూజిత పొన్నాడ.. షార్ట్ ఫిలింస్‌లో నటించారు. ఉప్మా తినేసింది, ఏ సాటర్‌డే ఈవెనింగ్, బూచీ, దీపికా పదుకొనె, పరిణయం వంటి షార్ట్ ఫిలింస్‌తో యూత్‌లో క్రేజ్ దక్కించుకున్నారు.

hari hara veera mallu Fame Pujita Ponnada Stunning look in saree goes viral

నాగార్జున - కార్తీ నటించిన ఊపిరిలో ఓ చిన్న రోల్‌తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన పూజిత పొన్నాడ.. అనంతరం ప్రేమమ్, దర్శకుడు, రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి , రన్, మిస్ ఇండియా , కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వేస్టేషన్, ఆకాశ వీధిలో, రావణాసుర, జోరుగా హుషారుగా వంటి చిత్రాల్లో నటించారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంతో పూజిత పొన్నాడ బ్రేక్ అందుకున్నారు. అందులో ఆది పినిశెట్టి లవర్‌గా సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించారు. లంగా ఓణీలో, క్యూట్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకున్నారు పూజిత.

రంగస్థలం బ్లాక్‌బస్టర్ అయినా ఆమె కెరీర్‌ అంతంత మాత్రంగానే సాగింది. సెకండ్ లీడ్, క్యారెక్టర్ రోల్స్‌లో పూజిత పొన్నాడ నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో ఐటెం సాంగ్‌లో చేస్తున్నారు. ఇటీవల పవన్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు వేసిన కొల్లగొట్టినాదిరో సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. వీరమల్లుతో పాటు తమిళ్‌లో భగవాన్ అనే చిత్రంలో పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటోంది పూజిత పొన్నాడ. ఎప్పటికప్పుడు తన సినిమాలు,వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు తన ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది , అయితే ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచేసి కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. దీంతో పూజిత పేరు తరచూ ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఈ రంగస్థలం భామ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పద్ధతిగా చీర కట్టుకున్న ఈ పూజిత పొన్నాడ.. కొంజెం కాదల్, కొంజెం మోదల్ సినిమా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎదపై పుట్టుమచ్చ చూపెడుతూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: pujita ponnada movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X