బయటపడ్డ హీరోయిన్ అందాల ‘నిధి’: మరీ ఇలా తెగిస్తే ఎలా?
మామూలుగా సినీ రంగంలో చాలా మంది టాలెంట్ ఉన్న హీరోయిన్లు కూడా సరైన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. అలాంటి వారిలో హైదరాబాద్ చిన్నది నిధి అగర్వాల్ ఒకరు. మెస్మరైజ్ చేసే అందం, మైమరపించే నటనతో ఆరంభంలోనే అదిరిపోయే గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. అవకాశాలను మాత్రం ఆశించిన విధంగా తెచ్చుకోవడం లేదు. అయినప్పటికీ అడపా దడపా సినిమాల్లో తళుక్కున మెరుస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే నిధి అగర్వాల్.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!
ఇక్కడ నుంచి అక్కడకు:నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే పూర్తి చేసిన తర్వాత ఈ అమ్మడి ఫ్యామిలీ కర్నాటకకు షిప్ట్ అయిపోయింది. అక్కడ మోడల్‌గా ప్రయాణం మొదలు పెట్టి.. ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. ఈ క్రమంలోనే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఫ్లాపులు ఎదురైనప్పటికీ:హీరోయిన్‌గా మారిన తర్వాత నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలోనూ నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధికి ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. అయినప్పటికీ ఆమె గ్లామర్, యాక్టింగ్‌తో మంచి పేరు పొందింది.
బిగ్గెస్ట్ హిట్.. హీరో ఫ్లాప్:ఫ్లాపుల వల్ల ఏమాత్రం ఇబ్బంది లేకుండా తెలుగులో నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్ నటించిన 'హీరో' మూవీ మాత్రం బాక్సాఫీస్ ముందు పరాజయం పాలైంది. తర్వాత తమిళంలోనూ ఓ సినిమాలో నటించింది.

పవన్, ప్రభాస్ మూవీల్లో:సినీ కెరీర్ మొదలైనప్పటి నుంచే రిజల్ట్‌తో పని లేకుండా ఏకధాటిగా సినిమాలు చేస్తూ వెళ్తోన్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే, ప్రభాస్ - మారుతి మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

అందులో ఫుల్ యాక్టివ్:హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ రేటు లేకపోయినా.. ఊహించని విధంగా ఆఫర్లను అందుకుంటోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన రేంజ్‌ను బాగా పెంచుకుంటోంది.

అందాలతో రెచ్చిపోతూ:నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే మితిమీరిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ భామ హాట్ షో మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ఇక, ఈ మధ్య తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో నిధి అగర్వాల్ నిత్యం వార్తల్లోనే ఉండడంతో పాటు ట్రెండ్ అవుతోంది.

నిధి బోల్డ్ పిక్స్ వైరల్:తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె క్యాజువల్ డీప్ నెక్ టాప్‌ను ధరించి యమ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె అందాలు విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా నిధి అగర్వాల్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











