సైలెంట్ గా నయనతార పెళ్లి.. ఆ వీడియోలతో అలా దొరికేసి.. నిజంగానే అయిపోయిందా?
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సినిమాల్లో నటించడమే కానీ ప్రమోషన్స్ సహా మరే ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనదు. కానే ఆమె కావాలంటూ సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే చాలా కాలంగా ఆమె పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు ఏకంగా పెళ్లి అయిపోయిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లి పీటల వరకు వెళ్లి
ఒకపక్క పెద్ద సినిమాల్లో గ్లామర్ రోల్స్, మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నయనతార దూసుకు పోతుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా నయనతార తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ వ్యవహారాలు సౌత్ లో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. శింబు, ప్రభుదేవా లాంటి నటులతో నయనతార పెళ్లి పీటల వరకు వెళ్లి బ్రేకప్ చేసుకుంది.

బ్రేకప్ చెప్పడంతో
మొదటిసారి శింబుతో పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు. నేడో రేపో మూడు ముళ్లు వేస్తారు అనుకుంటున్న తరుణంలో విడిపోయింది. ఇక ప్రభుదేవాతో కూడా అంతే. ఆయన కోసం మతం సైతం మార్చుకుంది నయన్. అంతా సిద్ధం అనుకుంటున్న తరుణంలో మరో సారి నయనతార బ్రేకప్ చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది.

మానేసి సొంతంగా
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి యువ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో పీకల్లోతో ప్రేమలో ఉంది నయనతార. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా కలిసే ఉంటున్నారు. పెళ్లి మాత్రమే కాలేదంతే. అయితే విఘ్నేష్ శివన్‌నే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నా వీరి పెళ్లి గురించి ఎప్పుడప్ చర్చ జరుగుతూనే ఉంటుంది. వివాహం తర్వాత నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ లోపు నయన్ తాను కమిటై ఉన్న చిత్రాలని ఫినిష్ చేయాలనీ భావిస్తోందని వివాహం తర్వాత నటన మానేసి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

ఫోటోలు, వీడియోలు వైరల్
అయితే ఇప్పుడు నయనతార వీడియో ఒకటి బయటకు రావడం చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి అమ్మవారి దర్శనం కోసం చెన్నైలోని కాళికాంబల్ ఆలయాన్ని సందర్శించారు. అదే సమయంలో అమ్మవారి దర్శనం కోసం ఆలయాన్ని సందర్శించిన చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియా రాజన్ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లతో కలిసి ఫోటో దిగారు. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
సింధూరం ధరించి
ఆ ఫోటోలు వీడియోలలో నయనతార నుదుటి మీద సింధూరం ధరించి ఉండడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే సాధారణంగా పెళ్లి అయిన స్త్రీలు మాత్రమే తల నుదురు కలిసే చోట సింధూరం ధరిస్తూ ఉంటారు. అందుకే నయన తారకు పెళ్లి అయిపోయిందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె దాచి ఉండవచ్చు అని కూడా అంటున్నారు. అనవసర మీడియా కవరేజ్ లేకుండా ఉండడం కోసమే ఇలా చేసి ఉండచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











