పేరు మార్చుకున్నా ‘మిర్చి’ హీరోయిన్.. ఆమె లేటెస్ట్ ఫోటోలు చేస్తే షాక్ అవాల్సిందే!
Richa Gangopadhyay: సినిమా ఇండస్ట్రీ రోజురోజుకు మారుతోంది. ప్రతి రోజు కొత్త నటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఓ నటి స్టార్ స్టేటస్ నిలబెట్టుకోవడం చాలా క్షష్టం. అందం, అభినయమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. ఆఫర్స్ వచ్చిన నటించిన మూవీ సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ఇలా ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించాలి. నిత్యం తమను తాము అప్డేట్ చేసుకుంటూ యంగ్ యాక్టర్స్ కు పోటీ ఇవ్వాలి. లేకపోతే.. అవుట్ డేటెడ్ అవుతారు. అలా అవుట్ డేటెడ్ అయినా..స్టార్ హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. ఇలా అవుట్ డేటెడ్ అయినా స్టార్ హీరోయిన్ తన పేరు మార్చుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి?
ఈ బ్యూటీ ఎవరో కాదు.. రిచా గంగోపాధ్యాయ్.. ఈ అమ్మడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో టాలీవుడ్ అడుగుపెట్టింది. ఈ మూవీలో రానా దగ్గుబాటి హీరోగా నటించారు. ఇటు రాణాకు.. అటు రిచాకు ఇద్దరికీ ఈ సినిమా డబ్యూ మూవీనే. పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీకి మంచి టాక్ రావడంతో కమర్షియల్ హిట్ కొట్టింది. ఇలా తొలి సినిమా హిట్ కావడంతో రిచాకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులో మంచి అవకాశాలు అందుకుంది రిచా గంగోపాధ్యాయ్.

ఈ మూవీ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ 'మిర్చి'లో నటించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ్, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అనుష్కతో పాటు రిచా కూడా మంచి గుర్తింపు వచ్చింది. తన అందం, అభినయంతో మెప్పించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్. ఇలా రిచాకు మిర్చి సినిమా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.
తరువాత విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది రిచా. చంద్రముఖి మూవీకి సీక్వెల్‌గా వచ్చిన'నాగవల్లి'మూవీలో నటించింది. అనంతరం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మిరపకాయ్'నటించింది. 'సారొచ్చారు',' భాయ్' సినిమాలో నటించింది. ఈ సమయంలోనే తమిళ సినిమాలు, ఒక బెంగాలీ సినిమా చేసింది. అంత సాఫీగా సాగుతున్న తన కెరీర్ కు సడెన్ గా గుడ్ బై చెప్పింది రిచా. అమెరికా అబ్బాయిని పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
సినిమా ఆఫర్స్ వస్తూ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే.. తన స్నేహితుడు జో లాంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతోంది రిచా. వీరికి 2021లో లూకా షాన్ లాంగెల్లా అనే బాబు జన్మించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రిచా గంగోపాధ్యాయ్ తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిచా గంగోపాధ్యాయ్ తన పేరును రిచా లాంగేళ్లగా మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మాత్రం నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ రిచా తన ఫోటోస్ నెట్టింట్టో పోస్ట్ చేసుకుంటుంది. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ..నెటిజన్లు కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











