HBD Mamita Baiju: మమితా బైజుకు బర్త్‌డే ట్రీట్.. ప్రేమలు బ్యూటీకి ఓవర్‌నైట్ స్టార్ డమ్

HBD Mamita Baiju: ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ ఎవరైనా ఉన్నారా అంటే? అది యంగ్ హీరోయిన్ మమిత బైజు అనే చెప్పాలి. ప్రేమలు మూవీతో ఒక్కసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమా ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో రీను పాత్రతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది మమితా. నేడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

Also Read
Peddi Day 19 Box Office: పెద్ది కలెక్షన్లలో భారీ డ్రాప్.. లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే?
Peddi Day 19 Box Office: పెద్ది కలెక్షన్లలో భారీ డ్రాప్.. లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే?

జూన్ 22, 2001న కేరళలోని కిడంగూర్‌లో జన్మించిన మమితా బైజు.. సినిమాల్లోకి రాకముందు సైకాలజీ చదివింది. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్న ఆమె 2017లో విడుదలైన 'సర్వోపరి పాలక్కారన్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు మలయాళ సినిమా నటించినప్పటికీ, ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగింది.

Recommended For You
OTT This Week: ఓటీటీ వినోదాలు డబుల్.. ఈ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లివే..
OTT This Week: ఓటీటీ వినోదాలు డబుల్.. ఈ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లివే..
HBD Mamita Baiju From Premalu Sensation to South India s Most Wanted Young Star

2024లో విడుదలైన 'ప్రేమలు' సినిమా మమితా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. నస్లెన్ సరసన ఆమె రీను అనే పాత్రలో యూత్ ను అట్రాక్ట్ చేసింది. తన నేచురల్ యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్,స్క్రీన్ ప్రెజెన్స్‌తో సోషల్ మీడియాలో ఒక సారిగా ట్రెండింగ్ స్టార్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ 'ప్రేమలు' సినిమా సక్సెస్ కావడంతో మమితాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత మమితా బైజుకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. తమిళంలో 'డ్యూడ్' సినిమా ఆమెకు మరో పెద్ద విజయాన్ని అందించింది. దీంతో కోలీవుడ్‌లోనూ ఆమె డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

You May Also Like
రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!
రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!

ప్రస్తుతం మమితా బైజు చేతిలో ఎన్నో భారీ ఉన్నాయి. దీని బట్టే ఆమె క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'జననాయక్' సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ధనుష్, సూర్య వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలతో ఆ క్రేజ్ మరింత పెరిగింది.

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ జాక్‌పాట్.. ఆమె నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా?
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ జాక్‌పాట్.. ఆమె నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా?

ఇక తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలో కూడా మమితా బైజు నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'నేనో బటర్‌ఫ్లై' పాట కూడా సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుంది. తాజాగా ఈ అమ్మడు పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఆ రోజు అర్థరాత్రి సమంత చేసిన పని ఎప్పటికీ మర్చిపోలేను.. రాజ్ నిడిమోరు సోదరి ఎమోషనల్
ఆ రోజు అర్థరాత్రి సమంత చేసిన పని ఎప్పటికీ మర్చిపోలేను.. రాజ్ నిడిమోరు సోదరి ఎమోషనల్

ఒక చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించి, 'ప్రేమలు'తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారి, ఇప్పుడు సూర్య, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది మమితా బైజు. ఆమె సినీ ప్రయాణం నిజంగా ఇన్సిరేషన్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, సినిమా ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని అభిమానులతో పాటు ఫిల్మీ బీట్ తెలుగు కోరుకుంటుంది. మరోసారి HBD Mamita Baiju.

Read more about: venky atluri suriya mamita baiju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X