HBD Rakul Preet: కూల్ కూల్ హీరోయిన్ రకుల్.. అందం, అభినయంతో
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. అందం, అభినయానికి పెట్టింది పేరు. మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రకుల్ ప్రీత్ కొద్ది కాలంలోనే అగ్రహీరోలతో జతకట్టారు. మోడలింగ్ నుంచి కన్నడ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా తెలుగులోకి ప్రవేశించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం విజయం సాధించడంతో వరుసుగా ఆఫర్లు పలకరించాయి. అలా స్టార్ హీరోయిన్‌గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ జన్మదినం అక్టోబర్ 10. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్‌కు తెలుగు ఫిల్మీబీట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.
రకుల్ ప్రీత్ అందంపైనే కాకుండా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం తెలిసిందే. ఆరోగ్య చిట్కాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించి వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇలా సినిమాలు, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆరోపణలు రావడంతో రకుల్ ప్రీత్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఎన్సీబీ అధికారులు విచారణకు హాజరై తనపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.
రకుల్ ప్రీత్ కేరీర్ విషయానికి వస్తే.. కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే శివ కార్తీకేయన్‌తో ఆయాలాన్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో నితిన్‌తో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో అర్జున్ కపూర్‌తో కలిసి సరిహద్దులో జరిగే ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











