HBD Trisha 41 ఏళ్ల త్రిష మొత్తం ఆస్తులు ఎంత? విశ్వంభర హీరోయిన్ కార్ల కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
సౌత్ ఇండియా క్వీన్‌గా వెలుగొందుతున్న సీనియర్ హీరోయిన్ త్రిష 41వ పుట్టిన రోజు నేడు. తెలుగు, తమిళ సినిమా రంగాల్లో వెంకటేష్, చిరంజీవి, విజయ్ తదితర అగ్ర నటులతో నటించింది. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా ఆమె కూడబెట్టుకున్న ఆస్తులు ఎంత? కార్ కలెక్షన్ ఏంటి ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓ లుక్కేద్దాం.
41 ఏళ్ల వయసులో కూడా నంబర్ 1గా రాణిస్తోంది త్రిష. 1983 మే 4న చెన్నైలో కృష్ణన్, ఉమా దంపతులకు జన్మించింది ఈ చెన్నై చిన్నది. చదువులో బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగు లేసింది. అతి చిన్న వయసులోనే మిస్ చెన్నై టైటిల్ గెలుచుకున్న త్రిష 1999 లో లేసా లేసా మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ప్రశాంత్, సిమ్రాన్‌ల జోడీ చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది.

16 ఏళ్లకే హీరోయిన్ గా మారిన త్రిష తెలుగులో వర్షం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అలా మొదలైన సౌత్ క్వీన్ మూవీ ప్రయాణం ఇప్పటిదాకా ఆగలేదు. ప్రస్తుతం లేడి సూపర్ స్టార్ నయనతారకు కూడా రానన్ని ఆఫర్లు త్రిషకు వస్తున్నాయి. ఈరోజు త్రిష బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
త్రిష రెమ్యూనరేషన్ విషయానికొస్తే రీసెంట్ బ్లాక్ బస్టర్ లియోకు రూ.4 కోట్లు, నెక్స్ట్ చేస్తున్న కమల్ హాసన్ థగ్ లైఫ్, చిరంజీవి విశ్వంభర చిత్రాలకు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాడ్స్ ద్వారా నెలకు 60 లక్షల రూపాయలు, సంవత్సరానికి 9 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది త్రిష. చెన్నైలో 6 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఉంది. త్రిష తన తల్లి, అమ్మమ్మలతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తుంది. ఇతర వ్యాపారాలలో కూడా ఆమె పెట్టుబడి పెట్టింది.

త్రిషకు కోట్ల విలువైన కార్లపై పెట్టుబడి పెట్టే అలవాటు లేదు. ఆమె గ్యారేజ్ లో ప్రస్తుతం 60 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, 63 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, 40 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉన్నాయి. అలాగే అన్నీ కలుపుకుని ఇప్పటికి త్రిష పేరు మీద 85 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ ఇలాగే ఉంటే ఆమె వంద కోట్ల ఆస్తులకు యువరాణి కావడానికి ఎన్నో రోజులు పట్టదు.
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక పొన్నియిన్ సెల్వన్, పొన్నియిన్ సెల్వన్ 2, లియో వంటి భారీ చిత్రాలలో నటించిన త్రిష ఇప్పుడు థగ్ లైఫ్, విశ్వంభర వంటి కోలీవుడ్, టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











