అతడు నన్ను ఫోర్స్ చేసాడు .. పాత అఫైర్‌పై నయన్ నోట షాకింగ్ మాట

గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా సౌత్ నటీనటులకు సంబంధించి బాగా వినిపిస్తున్న సినీ ప్రముఖుల పేర్లలో తమిళ స్టార్ హీరో ధనుష్ అలాగే కోలీవుడ్ క్వీన్ నయనతార పేర్లే అని చెప్పాలి. ఓ పక్క నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీపై ధనుష్ కేసు వేయగా.. ఇద్దరికీ సపోర్ట్ చేసేవారు, వ్యతిరేఖంగా మాట్లాడేవారు రెచ్చిపోవడంతో చాలా రచ్చే నడిచింది అని చెప్పాలి.

కాగా ఈ కాంట్రవర్సీ గరం గరంగా ఉంటున్న సమయంలోనే నయనతార పెళ్ళికి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం నయనతార - బియాండ్ ఏ ఫెయిరీ టేల్ ని పాపులర్ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు. అయితే ఈ డాక్యుమెంటరీకి డిజాస్టర్ టాక్ కూడా వచ్చింది. కానీ ఇందులో కొన్ని పర్టిక్యులర్ అంశాలు మాత్రం అటెన్షన్ తీసుకున్నాయి. నయనతార పర్సనల్ లైఫ్ చాలా మందికి తెలిసే ఉంటుంది.

he forced me nayanthara shocking comments on this hero

ఇపుడు దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడినప్పటికీ ఆమెకి అంతకు ముందు మరో తమిళ నటులతో డేటింగ్, పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయినవి కూడా ఉన్నాయని తెలిసిందే. కాగా వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అలాగే హీరో శింబు పేర్లు కూడా వినిపించాయి. అయితే వారిలో ఎవరి పేరు ఎత్తకుండా నయనతార.. నన్ను ఒకపుడు నా బాయ్ ఫ్రెండ్ ఫోర్స్ చేసాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె 2011 లో నందమూరి బాలకృష్ణ, దిగ్గజ దర్శకుడు బాపు గారి కాంబినేషన్ లో చేసిన "శ్రీరామ రాజ్యం" చేస్తున్న సమయంలో ఇక ఆ సినిమాతోనే తన నట జీవితానికి స్వస్తి చెప్తున్నట్టుగా వచ్చిన వార్తలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. అప్పట్లో సినిమా షూటింగ్ అయ్యాక నయనతార సెట్స్ లోనే ఏడుస్తూ కనిపించిన విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. అప్పట్లో నయన్ అలా సినిమాలు ఆపేయడానికి కారణం తన బాయ్ ఫ్రెండ్ అంటూ షాకిచ్చింది.

అతడు నన్ను ఇక సినిమాలు ఆపేయాలని ఫోర్స్ చేసాడు అని నాకు సినిమాలు వదులుకోవడం ఇష్టం లేదు. కానీ సినిమాలు ఆపేయాలని నన్ను ఫోర్స్ చేసాడు అంటూ వెల్లడించింది. అయితే నయన్ ని అంతలా ఫోర్స్ చేసింది ఎవరు అనేది ఆమె పేరు చెప్పకపోయినప్పటికీ వీరి గురించి తెలిసినవారు అయితే అది ప్రభుదేవానే అని యిట్టె చెప్పేస్తారు.

he forced me nayanthara shocking comments on this hero

ఆ సమయంలోనే ప్రభుదేవాతో పెళ్లి నయన్ కి నిశ్చయం అయ్యిపోయింది అని ఇక ఆ పెళ్లి తర్వాత నయన్ సినిమాల్లో కనిపించేది లేదు అంటూ వార్తలు వచ్చాయి. సో ప్రభుదేవా బలవంతం తోనే నయన్ అపుడు అలాంటి డెసిషన్ తీసుకొని ఉంటుంది అని చెప్పాలి.

కాగా ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం.. నయన్ మళ్ళీ సినిమాల్లోకి రావడం ఇప్పటికీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభుదేవా కూడా పలు సినిమాల్లో హీరోగా అలాగే కొరియోగ్రాఫర్ గానూ చేస్తున్నారు. రీసెంట్ గానే విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలో కీలక పాత్రలో కనిపించగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో ఓ సాంగ్ కి డాన్స్ కూడా కంపోజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X