సమంత గుండె ముక్కలైన ఆ సంఘటన.. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్‌తో ఫైర్
ప్రస్తుతం ఒక్క సౌత్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. కాగా సామ్ ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లలో కూడా ఫుల్ బిజీగా ఉండగా.. ఈ గ్యాప్ లోనే ఆమె మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి కి సిద్ధం అవ్వడం ఆ వార్తలు సామ్ ని మరింత హైలైట్ అయ్యేలా చేసాయి.
అయితే ఆ వార్తలు వైరల్ అవుతున్నా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తున్నప్పటికీ సమంత మాత్రం ఎక్కడా ట్రిప్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. కాగా నిన్న ఒక టి షర్ట్ వేసుకుంటే అందులో ఉన్న కొటేషన్ మాత్రం అందరికీ సమాధానం ఇచ్చేలా ఉందని చాలా మంది అనుకున్నారు.

మరి సామ్ అది నిజంగానే కావాలని సమాధానం ఇచ్చేందుకు వేసుకుందో లేదో కానీ ఇంకో ఘటన విషయంలో మాత్రం ఆమె హృదయం ముక్కలైపోయినట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం దేశాన్నే కదిలిస్తున్న విషాద ఘటన కోసం అందరికీ తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో ఓ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యంత ఘాతుకమైన చర్య ప్రతి ఒక్కరిని విస్మయానికి లోను చేసింది.
దీనితో సామ్ మాత్రం తన సోషల్ మీడియాలో తన ఆవేదనని వెళ్లగక్కుకోలేకుండా ఉండలేకపోయింది. వరుసగా అనేక స్టేటస్ లు పెడుతూ ఆడ పిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించే గొంతుగా తాను కూడా చేరింది. కోల్ కతా డాక్టర్ విషయంలో తప్పకుండ న్యాయం చేసి తీరాలి అంటూ డిమాండ్ చేస్తుంది.
అలాగే ఈ ఒక్క ఘటన కోసమే కాకుండా ఇటీవల దేశ వ్యాప్తంగా ఆడవాళ్ళ పట్ల జరిగిన ఎన్నో అఘాయిత్యాల వార్తల క్లిప్పింగ్స్ కూడా పెట్టి ఆడవాళ్లు రాత్రులు బయట తిరగకూడదా? అమ్మాయిలు ఒళ్ళు మొత్తం కప్పుకున్నా కూడా రేప్ చేస్తారా? అమ్మాయిలు బయట వ్యక్తులతో స్నేహంగా ఉంటే అది కూడా తప్పా? అంటూ సామ్ కోపంతో అనేక ప్రశ్నలు సంధించింది.

దీనితో మన దేశంలో జరుగుతున్నా సంఘటనల పట్ల ఆవేదన, ఆక్రోశం రెండూ వ్యక్తం చేసింది. కాగా ఈ విషయంలో సామ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా అనేకమంది ఫీమేల్ స్టార్స్ దిశా పటాని, శ్రద్ధ కపూర్, మౌని రాయ్ సహా ఇంకా చాలా మంది స్పందించారు. అలాగే సౌత్ నుంచి కూడా సామ్ తో పాటుగా తెలుగు నుంచి అనసూయ భరద్వాజ్, మరికొందరు చిన్న నటీనటులు సోషల్ మీడియాలో ఈ విషాద ఘటన పట్ల గొంతెత్తున్నారు.
ఇక సమంత అయితే ఇప్పుడు తెలుగులో "మా ఇంటి బంగారం" సినిమా తన నిర్మాణం లోనే చేస్తుండగా హిందీలో చేసిన అవైటెడ్ వెబ్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" ఈ నవంబర్ లో రిలీజ్ కి రాబోతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించగా రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











