షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా కుమారి: ఎద నుంచి థైస్ వరకూ థండర్ షో

టాలీవుడ్‌లో చాలా మంది ఎన్నో రకాల సినిమాలను చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోయే రోల్స్‌తో సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు. 'కుమారి' అనే పాత్రతో తెలుగు కుర్రాళ్ల మది దోచుకున్న ఈ భామ.. పెద్ద ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, తన రేంజ్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. హెబ్బా వదిలిన ఈ పిక్ మీరు కూడా చూడండి మరి!

అధ్యక్ష అంటూ.. అలా ఎలా: 2014లో వచ్చిన 'అధ్యక్ష' అనే కన్నడ చిత్రంతో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే తమిళంలోనూ ఓ సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'అలా ఎలా?' అనే చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది. అయితే, 2015లో వచ్చిన 'కుమారి 21ఎఫ్' మూవీతో ఈమెకు గుర్తింపు వచ్చింది. అలాగే ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగులో సెన్సేషన్‌గా మారిపోయింది.

Hebah Patel

ఎన్నో సినిమాలు చేసిందిగా: 'కుమారి 21ఎఫ్' మూవీతో ఫుల్ పాపులర్ అయిన హెబ్బా పటేల్.. ఆ తర్వాత వరుసగా 'ఈడో రకం.. వాడో రకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్', 'అంధగాడు,' 'మిస్టర్', 'ఏంజిల్', '24 కిస్సెస్', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాలు చేసింది. కానీ, ఈ చిత్రాలతో పెద్దగా విజయాలను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.

Hebah Patel

క్రేజీ మూవీ.. కెరీర్‌కు బూస్టు: కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్ అవకాశాలను సొంతం చేసుకోలేకపోతోంది. దీంతో 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన నటనకు మంచి స్పందన రావడంతో హెబ్బా పటేల్‌ కెరీర్‌కు బూస్ట్ వచ్చింది.

Hebah Patel

ఆ సినిమాలతో ఫుల్ బిజీగా: ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్‌కు తెలుగుతో పాటు తమిళంలోనూ చాలా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ చిన్నది 'గీత' అనే చిత్రంతో వచ్చింది. అలాగే, 'వ్యవస్థ' అనే సిరీస్‌లోనూ నటించింది. ఇక, ఇప్పుడేమో 'శాసన సభ', 'తెలిసినవాళ్లు' అనే మూవీలోనూ నటించింది. వీటితో పాటు తమిళంలో 'వల్లన్', 'ఆద్యా' వంటి చిత్రాలలో సైతం భాగం అయింది.

అక్కడ కూడా యాక్టివ్‌గానే: కొంత కాలంగా తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

Hebah Patel

అందాలను దాచుకోదుగా: హీరోయిన్ హెబ్బా పటేల్ ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో యమా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమె ఏ ఫొటో షేర్ చేసినా అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది.

షార్ట్ డ్రెస్‌లో హాట్‌గా ఫోజు : తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా చిన్న గౌన్ ధరించింది. దీంతో అటు ఎద అందాలను, ఇటు థైస్‌ను చూపిస్తూ యమ రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X