చానాళ్లకి అబ్బా అనిపించిన హెబ్బా.. బయటకు వెళ్ళడమే కాదు, వేసుకునే దుస్తులు కూడా తగ్గించిందట!

ముంబై భామ హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు అయిపోయింది. ముంబయికి చెందిన ఈమె కన్నడలో ముందు పరిచయం అయినా ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. ఒక కన్నడ, ఒక తమిళ సినిమాలో కనిపించినా సరే తెలుగులోనే ఆమెను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ మధ్యకాలంలో హిట్ కోసం పరితపిస్తున్న ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

కన్నడ సినిమాతో ఎంట్రీ

కన్నడ సినిమాతో ఎంట్రీ

అధ్యక్ష అనే కన్నడ సినిమాతో నటనా జీవితం ప్రారంభించిన ఈమెకు అదే ఏడాది తెలుగు, తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి.. తమిళంలో తిరుమం ఎనుమ్ నిక్కా అనే సినిమాలో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తర్వాత అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమెకు పేరు తీసుకురాకపోయినా కుమారి 21ఎఫ్ అనే సినిమాలో కుమారి పాత్రకు ఎంపిక అయ్యేలా చేసింది.

రెండో సినిమాకే సూపర్ హిట్

రెండో సినిమాకే సూపర్ హిట్

ఇక కుమారి 21 ఎఫ్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలవడంతో ఈ భామ కెరీర్ ఇక అడ్డంకులు ఉండవని అందరూ భావించారు. కానీ సినిమాల సెలక్షన్ విషయంలో తప్పు చేస్తోందో మరో కారణమో తెలియదు కానీ ఈ సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలు ఏవీ పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మాస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్ ఇలా వరుస పెట్టి సినిమాలు చేసినా ఆమెకు సరయిన హిట్ దక్కలేదు

ఐటెం సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్

ఐటెం సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్

ఇక లాభం లేదనుకుని తెలుగులో అతిథి పాత్రలు చేయడానికి కూడా సిద్ధం కావడంతో నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలో ఒక అతిథి పాత్రలో నటించింది. అది వర్కౌట్ కాకపోవడంతో తన సూపర్ హిట్ సినిమా కుమారి 21ఎఫ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా చిన్నపాటి పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా వర్కౌట్ కాకపోవడంతో వెబ్ సిరీస్ మీద కూడా ఒక కన్నేసింది. వెబ్ సిరీస్ లో నటించినా సరే పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హాట్ షూట్

హాట్ షూట్

అలా ఈ భామ రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. ఇక ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తెలిసిన వాళ్ళు అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ భామ అవకాశాల కోసం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.

దుస్తులు కూడా తగ్గించిందట

దుస్తులు కూడా తగ్గించిందట

అలా చేసిన ఒక ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి లానే పొట్టి బట్టలు వేసుకుని కనిపించిన ఈ భామ ఇంట్లో ఉంటూ బట్టలు తక్కువ వేసుకుంటున్నామని అలాగే బయటకు వెళ్లడం కూడా తగ్గించేశానని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫోటో మీద రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టన్నింగ్ అని ఆమె స్నేహితురాలు, హీరోయిన్ రితికా సింగ్ కామెంట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X