ఆ దర్శకుడు నన్ను అలా ఇబ్బంది పెట్టాడు.. స్టార్ డైరెక్టర్ ఏం చేశాడనే విషయం లీక్ చేసిన అదితి
అదితి రావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన హిరామండి ది డైమండ్ వెబ్ సిరీస్ ఈరోజు ఓటీడీలోకి వచ్చింది. ఈ సందర్భంగా అదితి రావు హైదరి తాజాగా ఈ వెబ్ సిరీస్ లోని ఓ సన్నివేశం కోసం డైరెక్టర్ సలహా మేరకు రోజంతా ఏమీ తినకుండా పస్తులు ఉన్నానంటూ వెల్లడించింది.
హీరోయిన్ అదితి రావు హైదరి ఓ సినిమా కోసం డైరెక్టర్ తనను ఆకలితో అలమటించేలా చేశాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆమెను ఒక రోజంతా పస్తులు ఉండేలా చేసిన ఆ డైరెక్టర్ ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన వెబ్ సిరీస్ హీరామండీ ది డైమండ్ బజార్. ఈ వెబ్ సిరీస్ లో అదితి రావు హైదరి కూడా ఓ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కోసం తను పడ్డ కష్టాన్ని తాజాగా బయట పెట్టింది అదితి.
కొంతమంది ఆమె చాలా సెన్సిటివ్ అంటూ నటీనటుల గురించి కామెంట్స్ చేస్తారని, కానీ ఒక నటి లేదా నటుడు తాము నటించే సినిమాల కోసం పడే కష్టం అంతకంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. దానికి ఉదాహరణగా హీరామండి వెబ్ సిరీస్ కోసం తాను ఒక రోజంతా ఆకలితో ఎలా అలమటించాల్సి వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని వివరించింది.
హీరామండి షూటింగ్ జరుగుతుండగా ఒక రోజు డైరెక్టర్ సంజయ్ అదితికి ఒక రోజంతా ఏమీ తినకూడదు అని సలహా ఇచ్చారట. ఎందుకంటే ఆమె ఆ సమయంలో ఒక ఫైర్ ఫుల్ సీన్ చేయాల్సి ఉందట. ఇక సన్నివేశం షూటింగ్ జరుగుతుండగా విపరీతంగా ఆకలితో ఉన్న అదితి ఆ సన్నివేశంలో ఈజీగా నటించగలిగిందట.
డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి సినిమాకు సంబంధించిన ప్రతి కళారూపంపై నిజమైన ప్రేమను కలిగి ఉంటాడని, సెట్స్ లో ఆయన పనితీరు అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా అదితి వెల్లడించింది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో వేశ్యలలో ఒకరైన బిబ్బోజన్ పాత్రను అదితి పోషించింది. హీరామండిలో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లతో పాటు ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్, తాహా షా బదుషా నటించారు.

ఈ వెబ్ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. రీసెంట్‌గా హీరామండి ప్రీమియర్ షో గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రీమియర్ షోకు బాలీవుడ్ సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మరోసారి ఈ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సినీ ప్రేక్షకులకు సినిమాతో సినిమా గ్రాండ్ నెస్ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు.
హీరామండి వేశ్యలు రాజ హోదాను కలిగి ఉన్న యుగం నాటి కథను ఈ సిరీస్ లో చూపించారు. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలోని వేశ్యల జీవితాల్లో జరిగిన ప్రేమ, ద్రోహం ఇతివృత్తాలతో హీరామండిని తెరకెక్కించనున్నారు. 1940ల నాటి స్వాతంత్య్ర పోరాట నేపధ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ వేశ్యల జీవన ప్రమాణాలు, స్థితిగతులను చూపుతుంది.
కాగా అదితికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్‌తో నటి అదితి రావు హైదరీ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అదితి రావ్ హైదరీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గత కొన్ని నెలలుగా అదితి రావ్ హైదరీ హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉంది. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











