Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి హేమ..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ (Hema)కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కూతురు ఈషా పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

హేమ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కూతురు ఈషా వయసు ఇంకా 24 ఏళ్లు మాత్రమేనని స్పష్టం చేశారు. 'ఇప్పుడే పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. కనీసం 25-26 ఏళ్లు వచ్చిన తర్వాతే సంబంధాలు చూస్తాను'అంటూ క్లియర్‌గా చెప్పారు. దీంతో 'స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతోంది' అనే ప్రచారాలకు పూర్తిగా చెక్ పడినట్లైంది. ఇండస్ట్రీలోనే పెళ్లి చేస్తారా లేదా బయట వ్యక్తికి ఇస్తారా అన్న ప్రశ్నకు కూడా ఆమె స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 'మంచి వ్యక్తి అయితే చాలు... ఇండస్ట్రీలోనైనా, బయటైనా నాకు ఎలాంటి కండిషన్ లేదు' అంటూ తన ఆలోచనలను వెల్లడించారు.

Hema Throwback Interview Actress Opens Up on Daughter s Marriage Family Life and Career

హేమ తన కూతురు జీవన విధానం గురించి చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈషా జాబ్ చేస్తోందని, రోజూ ఆటోలోనే ఆఫీస్‌కు వెళ్లి వస్తుందని తెలిపారు. 'బిజినెస్ చేయాలని ఆమెకు ఆసక్తి ఉంది. కానీ ముందుగా ఉద్యోగం చేస్తే జీవితాన్ని అర్థం చేసుకుంటుంది' అని చెప్పారు. బాస్ ఎలా ఆలోచిస్తాడు, ఉద్యోగి ఎలా ఫీల్ అవుతాడు అనే అనుభవం రావడం కోసం తానే జాబ్ చేయమని ప్రోత్సహించానని హేమ వెల్లడించారు. ఇంటి పనుల్లో కూడా ఈషా చురుకుగా ఉంటుందని, తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు వంట చేసి పంపించేదని చెప్పడం విశేషం.

కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై కూడా పలు రూమర్స్ వినిపిస్తున్నాయని హేమ తెలిపారు. ముఖ్యంగా భర్తతో విడిపోయారనే వార్తలను ఆమె ఖండించారు. 'మాకు పెళ్లై 25 సంవత్సరాలు దాటింది. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలిచారు'అని చెప్పారు. తన భర్త ముస్లిం అని, కానీ ఎప్పుడూ పబ్లిక్ ఈవెంట్స్‌కు రాకపోవడం వల్ల ఎక్కువగా కనిపించరని తెలిపారు. 'భార్యాభర్తలు విడిపోవచ్చు కానీ తల్లీ-కొడుకుల బంధం లాంటిది మా మధ్య ఉంది' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఇక తన సినీ కెరీర్ గురించి మాట్లాడిన హేమ, ఇప్పటికీ నటనపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. హీరోకు తల్లి, అక్క, వదిన, పక్కింటి ఆవిడ వంటి పాత్రలతో పాటు కామెడీ రోల్స్‌లోనూ మెప్పించిన ఆమె, భవిష్యత్తులో విలన్ లేదా వ్యాంప్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధమని తెలిపారు. ఇప్పటివరకు అవకాశాల కోసం ఎవరినీ అడగలేదని, కానీ ఇకపై డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లను సంప్రదించి మంచి పాత్రలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మరోసారి హేమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: hema tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X