మెగా హీరోతో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్దమైన గోపిచంద్.. ఈసారి పక్కా హిట్టు కొట్టాలని స్పెషల్ ప్లాన్!
తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ అలాగే మాస్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ ఈసారి పక్క బాక్సాఫీస్వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలి అని చూస్తున్నాడు. ఒక విధంగా ఈ హీరోకి మంచి ఫిజిక్ తో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికి కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ లో సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. గోపిచంద్ సినిమాలు అంటే ఒకప్పుడు మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కానీ అతను వరుస అపజయాలతో ఇటీవల కాలంలో మిగతా హీరోల కంటే కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది.
అయితే గోపీచంద్ కు అవకాశాలు మాత్రం చాలానే వస్తున్నాయి. కరెక్ట్ గా అతనితో ఒక మంచి సినిమా చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద సంచలనమే సృష్టించవచ్చు అని కొంతమంది దర్శకులు కూడా చెబుతూ ఉంటారు. ఇక గోపిచంద్ కూడా అలాంటి కథల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. సిటీ మార్ సినిమా కాస్త అదే రేంజ్ లో ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతగానో ఊహించుకున్నారు. కానీ రొటీన్ కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండటంతో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద క్లిక్ అవ్వలేదు. ఇక గోపీచంద్ ప్రస్తుతం తన నమ్మకాన్ని మొత్తం డైరెక్టర్ మారుతి పైన పెట్టుకున్నాడు.

అతనితో మొదటిసారి చేస్తున్న డిఫరెంట్ కామెడీ యాక్షన్ మూవీ 'పక్కా కమర్షియల్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై కూడా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. ఇది వరకే చాలాసార్లు వాయిదాలు పడిన ఈ సినిమా ఫైనల్ గా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట. మరో వైపు దర్శకుడు మారుతి వరుస విజయాలతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా అతని నుంచి గోపీచంద్ కు మంచి సక్సెస్ వస్తుంది అని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా తో పాటు అదే రోజు మరో మెగా హీరో సినిమా కూడా విడుదల కాబోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన మూడవ సినిమా 'రంగ రంగ వైభవంగ' కూడా జులై 1వ తేదీన విడుదల కానుంది. అసలైతే ఆ సినిమాను మే నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే మిగతా సినిమాల హడావుడి ఎక్కువ కావడంతో జులై 1వ తేదీకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. పక్కా కమర్షియల్ సినిమా కూడా అదే రోజు వస్తూ ఉండటంతో ఈ బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరి ఆరోజు ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











