యువ హీరోయిన్‌తో లండన్‌లో నాగచైతన్య రొమాన్స్.. అలా పట్టుబడ్డ అక్కినేని హీరో!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత నాగచైతన్య డేటింగ్‌తో బిజీ అయిపోయారు. సమంతతో బ్రేకప్ తర్వాత పలువురు యువ హీరోయిన్లతో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ కుర్ర హీరోయిన్‌తో డేటింగ్ చేస్తూ లైఫ్‌ను జల్సా చేస్తున్నారనే విషయం కొద్దికాలంగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే తాజాగా వీరిద్దరూ లండన్‌లో అనుకోకుండా మీడియాకు చిక్కిపోయారు. ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను చూస్తే.. మీరు నాగచైతన్య తాజా అఫైర్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ ఫోటో గురించిన వివరాల్లోకి వెళితే...

నాగచైతన్య డేటింగ్, అఫైర్ వార్తలు
సమంత రుత్ ప్రభుతో బ్రేకప్ తర్వాత సమంత, నాగచైతన్య ఎవరికి వారే జీవితాన్ని లాగిస్తున్నారు. అయితే సమంత కంటే.. చైతూ లైఫ్‌లోనే ఎక్కువ డేటింగ్, లివింగ్ రిలేషన్‌షిప్, అఫైర్లు అంటూ వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ అఫైర్ల గొడవలో హీరోయిన్ శోభితా ధూళిపాల పేరే ఎక్కువగా వినిపించింది. అయితే ఈ ఇద్దరు మాత్రం తమ అఫైర్ గురించి పెదవి విప్పలేదు.

ఇండియన్ రెస్టారెంట్ జమావర్‌లో
అయితే నాగచైతన్య తాజాగా లండన్‌లో పర్యటించారు. లండన్‌లోని మౌంట్ స్ట్రీట్‌లోని మైఫెయిర్ ప్రాంతంలోని ఇండియన్ రెస్టారెంట్ జమావర్‌లో డిన్నర్ చేశాడు. అయితే ఆ రెస్టారెంట్‌లో నాగచైతన్యను గుర్తుపట్టిన చెఫ్ సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. దాంతో తనపై అభిమానితో నాగచైతన్య సెల్పీ దిగాడు. అక్కడే నాగచైతన్య లివింగ్ రిలేషన్‌షిప్ గురించిన పేపర్ లీక్ అయింది.

నాగచైతన్య డిన్నర్ చేయడం
లండన్ జమావర్ రెస్టారెంట్‌లో నాగచైతన్యతో ఫోటో దిగిన తర్వాత చెఫ్ సురేందర్ మోహన్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. మా రెస్టారెంట్‌కు వచ్చి నాగచైతన్య డిన్నర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన మా రెస్టారెంట్‌లో ఫుడ్ ఎంజాయ్ చేశారనుకొంటాను. మా రెస్టారెంట్ విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెఫ్ పోస్టు పెట్టారు.
నాగచైతన్య ఫోటో దిగెటప్పడు
జమవార్ రెస్టారెంట్‌లో చెఫ్‌తో నాగచైతన్య ఫోటో దిగెటప్పడు కాస్త జాగ్రత్త పడాల్సి ఉండేది. చెఫ్‌తో ఫోటో దిగుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లో ఎవరు ఉన్నారనేది పరిశీలించాల్సింది. అయితే సెల్ఫీలో డిన్నర్ టేబుల్ వద్ద శోభితా ధూళిపాల కూర్చొని ఉండి సెల్ఫీలో దొరికిపోయింది. దాంతో లండన్‌లో రొమాంటిక్ జర్నీలో డిన్నర్ డేట్‌లో చైతూ, శోభితతో దొరికిపోయాడు.

శోభితా తన అఫైర్ వార్తను
అయితే చెఫ్ పోస్టు చేసిన ఫోటోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఇంత వరకు వచ్చిన తర్వాత శోభితా తన అఫైర్ వార్తను అధికారికంగా ప్రకటించాలి. ప్రతీ ఒక్కరికి లైఫ్ ఉంటుంది. ఏది జరిగినా ముందుకు వెళ్లాల్సిందే. నాగచైతన్యతో పెళ్లికి ముందు సిద్దార్థ్‌తో సమంతకు బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఏది జరిగినా మరిచిపోయి ముందుకు వెళ్లాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

శోభితా ధూళిపాళ కెరీర్ గురించి
శోభితా ధూళిపాళ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం సితారా అనే హిందీ సినిమాలో నటించింది. మంకీ మ్యాన్ అనే సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.


Click it and Unblock the Notifications











