twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రత్తాలు కోసం ముందుకొచ్చిన నితిన్.. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి!

    |

    కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా రాణించింది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి. ఆ తరువాత బోల్డ్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ కు రరాయ్ లక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరు ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలుగా ఐటమ్ సాంగ్ లో రాయ్ లక్ష్మి అలరించింది.

    ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తోంది. కృష్ణ కిషోర్ ఈ చిత్రానికి దర్శకుడు. థిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ దీపావళి కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని నవంబర్ 4 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

    Hero Nithin to launch Raai Laxmis WhereIsTheVenkatLakshmi first look

    యంగ్ హీరో నితిన్ చేతుల మీదుగా 4 వ తేదీ ఉదయం 11:45 గంటలకు వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ఫస్ట్ లుక్ లాంచ్ కానుండడం విశేషం. రాయ్ లక్ష్మి పూర్తి స్థాయిలో నటిస్తున్న ఈ తెలుగు చిత్రం ఆసక్తిని పెంచుతోంది. చిత్రానికి సంబందించిన ఇతర విశేషాలు, విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

    English summary
    Hero Nithin to launch Raai Laxmi's WhereIsTheVenkatLakshmi first look. Raai Laxmi playing lead role in this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X