రాజ్‌తరుణ్ లవర్ మాల్వీ మల్హోత్రాపై కత్తిపొట్లు..దాడితో ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ,ఎవరి పని ..?

రాజ్ తరుణ్ - లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. తనను మోసం చేసి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. రాజ్‌ను వదిలేయాలని, లేనిపక్షంలో అంతు చూస్తామని మాల్వీ , ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్, దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసుపై పోలీసుల విచారణ జరుగుతున్న దశలోనే రాజ్ లేకుండా తాను బతకలేనని, అన్నింటికీ మాల్వీయే కారణమంటూ అర్ధరాత్రి పూట తన లాయర్‌కు సూసైడ్ మెసేజ్ పెట్టి కలకలం సృష్టించింది లావణ్య. పోలీసులు సమయానికి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు పక్కా ఆధారాలు సమర్పిస్తే రాజ్ తరుణ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు.

hero raj tarun girl friend actress malvi malhotra attacked in Mumbai

తన మెడకు ఉచ్చు బిగుసుకుంటూ ఉండటంతో లావణ్యతో రాజీచేసుకునేందుకు రాజ్ తరుణ్ సైతం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ మేనేజర్, ఓ లాయర్ నుంచి తనకు రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని.. కేసు విత్‌డ్రా చేసుకుని, క్షమాపణలు చెబితే రూ.5 కోట్లు ఇస్తామన్నారని, కానీ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు లావణ్య తెలిపారు. మరోవైపు.. ఈ నెల 18లోపు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌కు నిన్న నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే . కేసు రోజురోజుకు జఠిలంగా మారుతుండటంతో పోలీసులు దూకుడు పెంచారు.

ఈ కేసు చిక్కుముడి వీడకముందే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. మాల్వీ తన కుమారుడిని ప్రేమ పేరుతో మోసం చేసిందని, తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆరోపించారు. ఈ దశలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మాల్వీపై హత్యాయత్నం జరిగిందట.. మూడు సార్లు ఆమెను కత్తితో పొడిచారని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మాల్వీని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారట.

ఆమెపై దాడి చేసింది ఎవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అతను ఆమెపై ఒత్తిడి తెచ్చారట, అయితే అందుకు మాల్వీ అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యోగేష్ ఆమెను కత్తితో పొడిచి పారిపోయాడట. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మాల్వీకి సర్జరీ చేయాల్సి వచ్చిందట. ఆసుపత్రి నుంచి కోలుకున్నాక యోగేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారట. ప్రస్తుతం రాజ్ తరుణ్ వ్యవహారంలోనూ ఆమె పేరు తెరపైకి రావడంతో గతంలో మాల్వీ ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు, ఇతర వీడియోలు బయటకు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X