Raj Tharun: యాంకర్ లాస్యతో రాజ్ తరుణ్ ఎఫైర్.. తొలిసారి అసలు విషయం చెప్పిన హీరో!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న కుర్రహీరో రాజ్ తరుణ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్ కల్గిన ఈయన 2013లో ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటికీ హీరోగా అనేక సినిమాలు చేస్తున్న ఈయన తొలిసారి తన ప్రేమాయణం గురించి చెప్పారు. ముఖ్యంగా తనకు యాంకర్ లాస్యతో ఉన్న ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి చిత్రం విడుదల అయి సూపర్ డూపర్ హిట్ గా నిలవగా.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి హీరో రాజ్ తరుణ్ కు. ముఖ్యంగా సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, బెలూన్ వంటి అనేక సినిమాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇవి మాత్రమే కాకుండా రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, మను చరిత్ర, నా సామిరంగా వంటి సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేశాడు.

ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం భలే ఉన్నాడే, తిరగబడరా సామి వంటి సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసు కల్గిన ఈయన.. మూడో సినిమా చేస్తున్న సమయంలోనే ఈయనపై రూమర్లు మొదలు అయ్యాయి. ముఖ్యంగా ఈ కుర్రాడు.. ఓ తెలుగు యాంకర్ తో లవ్ అఫైర్ నడుపుతున్నాడని పెద్ద ఎత్తున టాక్ నడించింది. ఒకరికోసం ఒకరు చనిపోవాలని కూడా అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఇంత కాలం తర్వాత రాజ్ తరుణ్ ఈ విషయంపై స్పందించాడు.
అసలు తనకు యాంకర్ లాస్య అంటే ఎవరో కూడా తెలియదని.. కానీ తనకు, ఆమెతో అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చినప్పుడు చాలా నవ్వొచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే ఆమెతో కలిసి తాను దిగిన ఫొటో చూసి, ఆ థంబ్ నెయిల్స్ చూసి షాక్ అయ్యానని.. అసలు ఆ ఫొటో తాను ఆమెతో ఎప్పుడు దిగానో తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా రీసర్చ్ చేస్తుండగానే... తాను కుమారి 21 ఏఫ్ సినిమ ఆడియో లాంచ్ రోజు దిగిన ఫొటో అని అర్థం అయిందని తెలిపాడు. అయితే మధ్యలో ఇంకో వ్యక్తి ఉండగా.. ఆయనను కట్ చేసి తామిద్దరినీ ఒకే ఫ్రేములో చూపించారని రాజ్ తరుణ్ వివరించాడు.
లాస్య కనీసం తనకు పరిచయం కూడా లేదని.. ఆమె ఎవరు, ఏంటనేది కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు. అలాంటిది ఇలాంటి వార్తలపై తాను ఎలా స్పందించాలో తెలియక ఊరుకున్నానని వివరించాడు. అంతేకాకుండా కనీసం ఆమె తన స్నేహితురాలు అయినా, పరిచయం ఉన్నా ఆ విషయమే చెప్పేవాడిని కానీ.. ఆమె ఎవరో కూడా తెలియకుండా.. ఏమని క్లారిటీ ఇవ్వాలో అర్థం కాలేదని వివరించాడు. తనకు గతంలో ఓ బ్రేకప్ స్టోరీ ఉందని, సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నట్లు చెప్పిన రాజ్ తరుణ్.. లాస్యతో మాత్రం తనకు పరిచయం కూడా లేదని మరోసారి వివరించాడు.


Click it and Unblock the Notifications











