Samantha సమంత నిజస్వరూపం బయటపెట్టిన హీరో సిద్ధార్థ్.. ఆమె ఎలాంటిదంటే?
హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించారు. ఇటీవల చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ హీరో. అయితే ఈ హీరో వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత గురించి చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అసలు సిద్ధార్థ్ సమంతపై ఎలాంటి కామెంట్స్ చేశారు.. ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.
బాయ్స్, బొమ్మరిల్లు సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ కొట్టేశాడు సిద్ధార్థ్. ఇక తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో కొంతకాలం స్టార్ హీరోగా దూసుకుపోయాడు. మరి ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరిసారిగా సిద్ధార్థ్ చిన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. వసూళ్లను సైతం రాబట్టింది. మెసెజ్ ఓరియెంటేడ్ గా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

ఇక ఆ విషయం పక్కన పెడితే.. హీరోయిన్ సమంతను అప్పట్లో సిద్ధార్థ్ ప్రేమించాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ మాయచేశావే చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సమంత.. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి. వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ నెట్టింట అప్పట్లో ప్రచారం కూడా సాగింది. అందుకు తగ్గట్లు వీరు కూడా బయట బాగానే తిరుగుతూ కనిపించారు. దీంతో అంతా వీరు పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యారు.

ఇక వీరి కాంబినేషన్లో జబర్దస్త్ అనే సినిమా సైతం వచ్చింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే అప్పటికే పెళ్లైన సిద్ధార్థ్ తో ప్రేమలో పడిందని అంతా అనుకున్న సమయంలో సమంత షాకిచ్చింది. నాగచైతన్యను పెళ్లాడి అందరికీ ట్వీస్ట్ ఇచ్చింది సమంత. ఇక వీరి పెళ్లి టైంలో బాగానే రూమర్స్ వినిపించాయి. సిద్ధార్థ్ కు హ్యాండిచ్చి నాగచైతన్యను పెళ్లాడుతుందని అంతా వార్తలు రాసుకున్నారు. వాటిన్నింటినీ వీరు లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ జంట కొన్నాళ్లు మాత్రమే కలిసి ఉంది. ఏమైందో తెలియదు విడాకులు అంటూ ప్రకటించారు. ఇప్పటికీ వీరి విడాకుల గురించి సరైనా రీజన్ తెలియదు. ఇక ఎవరి జీవితం వారు గడుపుతూ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఈ సమయంలో సమంత గురించి ఓ వీడియో వైరల్ గా మారింది. హీరో సిద్ధార్థ్ సమంత గురించి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత నిజస్వరూపం గురించి చెప్తూ.. షాకిచ్చాడు సిద్దు.

ఓ ఇంటర్వూలో సిద్ధార్థ్ పాల్గొనగా.. ఆ యాంకర్ మిస్ బ్యూటీఫుల్ ఎవరు అని అడగ్గా.. సమంత అంటూ చెప్పుకువచ్చాడు సిద్ధార్థ్. ఆ తర్వాత మిస్ ఫర్ ఫెక్ట్ ఎవరు అంటే.. మళ్లీ సమంత అని చెప్పాడు. అంటే అప్పట్లో సమంతాను అంతలా ప్రేమించాడు కాబట్టే సిద్దు ప్రతిదానికి సమంత అంటున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో ట్రెండింగ్ గా మారీంది. మీరు దానిపై ఓ లుక్ వేసి.. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications











