Samantha : 'సమంత అలాంటి వ్యక్తి - ఆమెను చూడగానే వణికిపోయా'
టాలీవుడ్ మరో నేచురల్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో విజయాల్ని అందుకుంటూ స్టార్ స్టేటస్‌ను అందుకునే దిశగా ముందుకెళ్తున్నాడు. అయితే ఇతడు తాజాగా సమంత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంతను అలా చూసి భయపడిపోయినట్లు చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఆడియెన్స్ అంతా ఫుల్ కనెక్ట్
షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెండ్ యాక్టర్ సుహాస్. అందుకే ఇప్పుడు ఇతడికి చిత్రసీమలో గిరాకీ స్లోగా పెరుగుతోంది. తనకు వచ్చిన ఎలాంటి పాత్రనైనా తన సూపర్ నేచురల్ యాక్టింగ్ డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఆడియెన్స్ అంతా ఫుల్ కనెక్ట్ అయిపోతున్నారు. మొదట సైడ్ క్యారెక్టర్లు చేసిన ఇతడికి తన స్నేహితుడి దర్శకత్వంలోనే కలర్ ఫొటో సినిమా చేసే అవకాశం దక్కింది. అలా తొలి ప్రయత్నంలోనే హీరోగా మంచి సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

లాభాలు తెచ్చే హీరోగా
అక్కడితో ఆగకుండా ఇతర కథానాయకుల్లో చిత్రాల్లోనూ భిన్నమైన పాత్రలు పోషించి మెప్పించాడు. హిట్ 2 చిత్రంలో అయితే సైలెంట్‌గా ఉంటూనే తన సైకో యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలా తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. అనంతరం రైటర్ పద్మభూషణ్ సినిమాతో మహిళా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. అనంతరం ఓ వెబ్‌సిరీస్‌లో కాస్త నెగటివ్ క్యారెక్టర్ చేసి నటనలో మరో మెట్టు ఎక్కాడా. ఇక రీసెంట్గా అంబాజీపేట మ్యారేజీబ్యాండు సినిమాతో అయితే మరోసారి ప్రేక్షకుల మదిని దోచేశాడు. అలా తాను ఎంచుకునే కథలు, పాత్రలతో బాక్సాఫీస్ ముందు వసూళ్లను అందుకుంటున్నారు. నిర్మాతలకు లాభాలు తెచ్చే హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
సమంత గురించి మాట్లాడుతూ...
అయితే తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ సమంత గురించి మాట్లాడాడు. ఆమెను తొలిసారి చూసినప్పుడు భయపడిపోయినట్లు తెలిపాడు. సమంతను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు బాగా భయమేసింది. ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో అని తొలిసారి సెట్స్‌కు వెళ్లినప్పుడు అనుకున్నాను. నీకు ఫస్ట్ బ్రేక్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ అవుతావ్ అని నాతో ఆమెనే మొదటి సారి చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే జరిగింది. ఓ సారి షూటింగ్లో సమంతను చాలా మంది కలిసి ఎంతో ఆప్యాయత చూపించారు. చాలా మంది ప్రేమను పొందింది. ఎంతో కష్టపడితేనె గానీ ఆ స్టేజ్‌కు వెళ్లలేం. ఆమె అంటే నాకు చాలా గౌరవం. అని చెప్పాడు.

పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా...
ఇకపోతే సుహాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, ఆనందరావు అడ్వెంచర్స్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అలానే దిల్ రాజు ప్రొడక్షన్లోనూ ఓ సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఉప్పు కప్పురంబు అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇందులో ఏకంగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌తో కలిసి నటించనుండటం విశేషం. ఇది కచ్చితంగా సుహాస్ ఇమేజ్ను మరింత పెంచుతుంది.


Click it and Unblock the Notifications











