వరుణ్ సందేశ్ భార్య విడాకులా? వితికా షేర్ సోషల్ మీడియా పోస్టుపై అనుమానాలు!
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడు ఏ సెలబ్రెటీ డైవర్స్ అంటూ బాంబు పేలుస్తారో తెలియక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. స్మాల్ స్క్రీన్, బిగ్‌స్క్రీన్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా డివోర్స్ తీసుకోవడం వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఆనవాయితీగా మారిపోయింది. సెలబ్రెటీలు సుదీర్ఘంగా డేటింగ్ చేసి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కినంత సేపు పడటం లేదు విడాకులు తీసుకోవడానికి.
కారణం ఏదైనా విడిపోవడం వల్ల రెండు కుటుంబాలకు, బంధుమిత్రులకు, సన్నిహితులకు , నటీనటుల అభిమానులకు తీరని వ్యధ మిగులుతోంది. వీరిని కలిపేందుకు పెద్దలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ఖాతాలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. లేదంటే ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేయడం వంటి చర్యలతో విడాకులపై హింట్ ఇస్తున్నారు. ఒకవేళ ఏం లేకపోయినా , ఏదో జరుగుతోందని పుకారు రాయుళ్లు హాట్ హాట్ గాసిప్స్‌ని వండి వారుస్తారు.

ఇకపోతే.. తెలుగు జనాలకు వితికా శేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమ ఇస్క్ కాదల్, ప్రేమించే రోజుల్లో, భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో 2015లో యువ నటుడు వరుణ్ సందేశ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన వితిక .. 2019లో బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో భర్త వరుణ్‌తో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌తో వితిక తెలుగు లోగిళ్లకు బాగా చేరువయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటంతో పాటు ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి యూట్యూబర్‌గానూ సక్సెస్ కొట్టింది.
చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన నాంది, విరాజి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. విరాజిలో ఆయన లుక్, హెయిర్ స్టైల్‌పై విపరీతంగా ట్రోలింగ్ నడవగా.. ఈ యంగ్ హీరో తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వితికతో కలిసి వరుసగా మీడియా మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తున్న వరుణ్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. వరుణ్ సందేశ్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఇలాంటి వేళ వితిక ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నటుడు శివకుమార్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె.. న్యూ బిగినింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లకు కాసేపు ఏం అర్ధం కాలేదు. వితిక - వరుణ్‌లు విడిపోతున్నారా, ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే వితిక ఏదో కొత్త క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే సందర్భంలో వివరాలు చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో ఆమె చెబితే తప్పించి ఈ ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











