Adah Sharma: హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ను కొన్న అదాశర్మ.. క్లారిటీ ఇచ్చేసిందిగా!

పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అదా శర్మ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల కేరళ స్టోరీ సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షంతో పాటు... వివాదాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఈ భామ.. ఓ స్టార్ హీరో సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ ను కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక దీనిపై అదా శర్మ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....

హార్ట్ అటాక్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో నటించి అలరించిన ఈ భామ.. కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్టును అందుకుంది. ఇక ఈ భామ గురించి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. గత కొంత కాలంగా ఈ భామ.. ఓ స్టార్ హీరో చనిపోయిన ప్లాట్ ను కొనుగోలు చేస్తుందంటూ.. వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించింది. అసలు ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సుశాంత్ రాజ్ పుత్.

Heroine Adah Sharma

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన అపార్ట్‎మెంట్‎లో సూసైడ్ చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ మరణాన్ని ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటీకీ సుశాంత్ ఆత్మహత్య వెనకున్న మిస్టరీ రివీల్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే సుశాంత్ సినిమాల్లో నటించేటప్పుడు బాంద్రాలోని మోంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవాడు. 2020లో అక్కడే సూసైడ్ చేసుకున్నాడు.

ఈ ఘటన జరిగిన దగ్గరి నుంచి ఆ ఫ్లాట్ అలా ఖాళీగానే ఉంది. అంత దైర్యం చేసి ఎవరూ అద్దెకు ఉండేందుకు ముందుకు రాలేదు.. అయితే ఇళ్లు కొనేందుకు మాత్రం కొంత మంది వచ్చినా ఆ ఇంటి యజమాని ఒప్పుకోలేదని తెలుస్తోంది. అద్దెకు ఇవ్వడానికే ఆయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే తాజాగా సుశాంత్ సింగ్ ఉన్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి అదా శర్మ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

Adah Sharma sushant singh rajput

అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే ఎట్టకేలకు ఈ విషయంలో అదా శర్మ క్లారిటీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం... అదా శర్మ సుశాంత్ ఉన్న ఫ్లాట్‎ను కొన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ ఫ్లాట్‎ను చూసేందుకు అదా వచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన పోస్ట్‌ కూడా ఒకటి ఇన్‌ స్టాగ్రామ్‌ లో వైరల్ అవుతోంది. సుశాంత్ ఇంటిని కొనుగోలు చేస్తుందన్న వార్త వైరల్ కావడంతో శనివారం మీడియా నటిని ప్రశ్నించగా అలాంటిది ఏమైనా ఉంటే ముందుగా మీకే చెబుతాని చెప్పుకొచ్చింది అదా.

Heroine Adah Sharma

ఆ ఇల్లు కొనడం ఫైనల్ అయితే త్వరలోనే మీకు స్వీట్స్ పంచిపెడతానని వెల్లడించింది. ఇదిలా ఉంటే కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో సుశాంత్ ప్రైవసీ కోసం తన ఫ్యామిలీకి దూరంగా బాంద్రాలోని ఫ్లాట్‎లో ఉండేవాడు. సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ కు నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవాడని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్న సుశాంత్... ఆకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్ కు గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X